Kajal Aggarwal : బాబు పుట్టిన రెండు నెలలకే.. ఆ సినిమా కోసం చాలా పెయిన్ అనుభవించాను..

తాజాగా సత్యభామ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ..

Kajal Aggarwal : బాబు పుట్టిన రెండు నెలలకే.. ఆ సినిమా కోసం చాలా పెయిన్ అనుభవించాను..

Kajal Aggarwal says she felt lot of pain for Indian 2 Movie work after giving Birth to her Child

Updated On : May 20, 2024 / 12:49 PM IST

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ కరోనా సమయంలో కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పెళ్లి చేసుకొని, బాబుని కని ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. ఇప్పుడు మళ్ళీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలో కాజల్ అగర్వాల్ మొదటిసారి ఫిమేల్ ఓరియెంటెడ్ చేసిన ‘సత్యభామ’ సినిమాతో రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది కాజల్.

తాజాగా సత్యభామ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. నాకు బాబు పుట్టిన తర్వాత రెండు నెలల్లోనే హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను ఇండియన్ 2 సినిమా కోసం. అప్పుడు చాలా పెయిన్ అనుభవించాను. కానీ కష్టపడి నన్ను నేను బిల్డ్ చేసుకున్నాను. నాలుగేళ్ళ క్రితం ఓకే చేసిన సినిమా అది. నేను వద్దు అనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళని తీసుకుంటారు. కాని నేను ఆ సినిమా చేయాలనుకున్నాను. శంకర్ సర్ కూడా నా డేట్స్ అడ్జస్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసి సపోర్ట్ ఇచ్చారు. నీ ప్లేస్ లో ఇంకొకరిని తీసుకోను భయపడకు అని చెప్పారు శంకర్ సర్. చాలా కష్టంగా ఉన్నా నేను ఇష్టపడి చేశాను, దానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను అని తెలిపింది.

Also Read : Manchu Manoj : ‘మిరాయ్’ నుంచి మంచు మనోజ్ గ్లింప్స్ వచ్చేసింది.. బ్లాక్ స్వార్డ్.. మోస్ట్ డేంజరస్ ఫోర్స్..

దీంతో బాబు పుట్టిన రెండునెలలకే పెయిన్ అనుభవిస్తూ కూడా సినిమా కోసం హార్స్ రైడింగ్ నేర్చుకుంది అంటే కాజల్ కి సినిమాపై ఎంత డెడికేషన్ ఉందో మరోసారి అర్ధమవుతుంది. కాజల్ అభిమానులు, నెటిజన్లు ఈ విషయంలో ఆమెని అభినందిస్తున్నారు.