Manchu Manoj : ‘మిరాయ్’ నుంచి మంచు మనోజ్ గ్లింప్స్ వచ్చేసింది.. బ్లాక్ స్వార్డ్.. మోస్ట్ డేంజరస్ ఫోర్స్..

నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు కావడంతో మిరాయ్ సినిమా నుంచి మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు.

Manchu Manoj : ‘మిరాయ్’ నుంచి మంచు మనోజ్ గ్లింప్స్ వచ్చేసింది.. బ్లాక్ స్వార్డ్.. మోస్ట్ డేంజరస్ ఫోర్స్..

Manchi Manoj Mirai Movie Black Sword Glimpse Released

Updated On : May 20, 2024 / 11:49 AM IST

Manchu Manoj : ఇటీవల ‘హనుమాన్’ సినిమాతో భారీ హిట్ కొట్టిన తేజ సజ్జ నెక్స్ట్ మిరాయ్ అనే అద్భుతమైన సినిమాతో రాబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం మిరాయ్ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.

మిరాయ్ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. నేడు మంచు మనోజ్ పుట్టిన రోజు కావడంతో మిరాయ్ సినిమా నుంచి మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు. బ్లాక్ స్వార్డ్ అనే ఓ కత్తి గురించి, అది ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ అని చెప్తూ మంచు మనోజ్ పాత్ర దగ్గర ఆ కత్తి ఉన్నట్టు, దాంతో మనోజ్ యుద్దాలు చేస్తున్నట్టు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ గ్లింప్స్ చూపించారు. దీంతో మిరాయ్ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మీరు కూడా ఈ గ్లింప్స్ చూసేయండి ..

 

ఇక ఈ మిరాయ్ సినిమా.. కళింగ యుద్ధం తరువాత అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాట కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఆ గ్రంధాన్ని కాపాడే యోధులలో తేజ సజ్జ ఒకడిగా నటిస్తున్నట్టు సమాచారం. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18న ఈ మిరాయ్ సినిమాని రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్.