ఆ కారుతో నాకెలాంటి సంబంధం లేదు : ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

రేవ్ పార్టీలో తన స్టిక్కర్ తో ఉన్న కారు విషయంపై ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఆ కారుతో నాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.

Bangalore Rave Party : బెంగుళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్ లో ఆదివారం అర్థరాత్రి బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరిగింది. సమాచారం అందుకున్న కర్ణాటక పోలీసులు తెల్లవారు జామున 3గంటల సమయంలో రేవ్ పార్టీపై దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పలువురు సినీ ప్రముఖులు, మోడళ్లు పట్టుబడ్డారు. అక్కడ డ్రగ్స్ కూడా వాడినట్టు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీ జరిగిన ప్రదేశాన్ని పాలీసులు, నార్కోటిక్ అధికారులు పరిశీలించారు. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

Also Read : Artist Hema : ఒరే బాబు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు..

రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కొకైన లభ్యమైనట్లు సమాచారం. ఈ పార్టీలో 25మందికిపైగా యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రేవ్ పార్టీలో ఏపీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి పేరుతో స్టిక్కర్ కలిగిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయనకు కూడా ప్రమేయం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి స్పందించారు. రేవ్ పార్టీలో గుర్తించిన కారుతో నాకు సంబంధం లేదు. అది నా కారు కాదు. కారు మీద ఏ స్టిక్కర్ ఉందో నేను చూడలేదు. నా పేరు మీద స్టిక్కర్ ఉందని వేరేవాళ్లు ఫోన్ చేస్తే నాకు తెలిసింది. నాకు సంబంధం లేని ఘటనపై నేను స్పందించనని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు