Artist Hema : ఒరే బాబు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు..

బెంగుళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆర్టిస్ట్ హేమ పాల్గొంది అని వచ్చిన వార్తలపై హేమ స్పందిస్తూ వీడియో విడుదల చేసింది.

Artist Hema : ఒరే బాబు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు..

Artist Hema Gives Clarity about Bengaluru Rave Party News

Updated On : May 20, 2024 / 2:47 PM IST

Artist Hema : నిన్న రాత్రి బెంగుళూరులో ఓ రేవ్ పార్టీ జరిగినట్టు, అందులో పలువురు టాలీవుడ్ నటీనటులు ఉన్నట్టు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. కన్నడ పోలీసులు బెంగుళూరులో ఓ రేవ్ పార్టీని భగ్నం చేసారు. ఆ పార్టీలో డ్రగ్స్ కూడా వాడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ రేవ్ పార్టీ జరిగిన ప్రదేశాన్ని పాలీసులు, నార్కోటిక్ అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇప్పటికే ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురిని కన్నడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అయితే ఇందులో టాలీవుడ్ నటీనటులు ఉన్నారని, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఉందని వార్తలు వచ్చాయి. దీంతో నటి హేమ ఈ వార్తలపై స్పందిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసింది.

Also Read : Prabhas – NTR : సలార్ 2 ఇప్పట్లో లేనట్టే.. ఎన్టీఆర్ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ..

ఈ వీడియోలో హేమ మాట్లాడుతూ.. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ ఫామ్ హౌస్ లోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీతో సంబంధం లేదు. ఇందులోకి అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు అని తెలిపింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.