Fish Prasadam : బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం.. పంపిణీ తేదీ ఎప్పుడు.. ఎక్కడంటే?

ప్రతీయేడాదిలాగానే ఈ ఏడాదికూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు.

Battina Family Fish prasadam : ప్రతీయేటా మృగశిర కార్తె సమయంలో బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీయేడాదిలాగానే ఈ ఏడాదికూడా చేప ప్రసాదం పంపిణీకి బత్తిని ఫ్యామిలీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8న శనివారం ఉదయం పదకొండు గంటలకు ప్రవేశిస్తుంది. జూన్ 8 ఉదయం పదకొండు గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలిపారు. చేప ప్రసాదం పూర్తిగా ఉచితంగా భక్తులకు అందిస్తామని అన్నారు.

Also Read : IPL 2024 : హైదరాబాద్‌కు కలిసొచ్చిన వర్షం.. క్వాలిఫయర్‌లో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇలా ..

పూజ కార్యక్రమాలు, ప్రసాదం తయారీ దూద్ బౌలిలో జూన్ 7వ తేదీన జరుగుతాయని చెప్పారు. వివిధ ఫౌండేషన్ల సహకారంతో.. మెడికల్ సర్వీస్, భోజన సౌకర్యం, మంచి నీటి సరఫరా 24 గంటల పాటు ఉచితంగా భక్తులకు ఇస్తామని చెప్పారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప మందు ప్రసాదాన్ని అందిస్తున్నామని చెప్పారు. చేప ప్రసాదం పంపిణీకి గత ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు చేసిన విధంగానే.. ఈ ప్రభుత్వాన్నిసైతం తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.

Also Read : Artist Hema : ఒరే బాబు నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు..

చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నిశాఖల సమన్వయంతో ఎలాంటి అసౌకర్యం లేకుండా చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నాం. దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

 

 

ట్రెండింగ్ వార్తలు