Video: ఇల్లాలి ఇంటిపోరు పడలేక.. భార్య కొడుతోందంటూ అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్‌కి వచ్చిన భర్త

నిక్కర్ పై వచ్చి భార్యపై ఫిర్యాదు చేసిన అతడిని చూసి మొదట పోలీసులు

భర్త కొడుతున్నాడని భార్య పోలీస్ స్టేషన్‌కు వెళ్లే ఘటనలు తరుచూ చూస్తుంటాం. భర్త వేధింపులు భరించలేక భార్య అతడిపై కేసులు పెట్టడం వంటివి జరుగుతుంటాయి. అయితే, భార్య కొడుతోందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు ఓ భర్త. ఆమెపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని, ఆమె బారి నుంచి తనను రక్షించాలని కోరాడు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. తరుచూ తన భార్య కొడుతోందని, ఇక ఆమె దెబ్బలకు తాళలేనని, అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు ఓ వ్యక్తి. నిక్కర్ పై వచ్చి భార్యపై ఫిర్యాదు చేసిన అతడిని చూసి మొదట పోలీసులు కూడా కంగుతిన్నారు.

అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. భార్య వేధింపులు తాళలేక పలువురు పురుషులు గతంలోనూ పోలీస్ స్టేషన్లకు వెళ్లిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇటువంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అవుతున్నాయి. కాలం మారిందని ముక్కున వేలు వేసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదంటూ వాపోతున్నారు నెటిజన్లు.

Also Read: ఆ కారుతో నాకెలాంటి సంబంధం లేదు : ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు