US Supreme Court : గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది.

US Supreme Court..reportedly votes to repeal abortion law : గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. అబార్షన్‌ హక్కులను తొలగిస్తూ, దానికి సంబంధించిన చట్టాన్ని రద్దు చేసేలా కోర్టు ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఓ డ్రాఫ్ట్‌ లెటర్‌ లీక్‌ అయింది. అబార్షన్ హక్కులను పరిరక్షించే చట్టాన్ని త్వరగా రూపొందించాలని అధ్యక్షుడు బిడెన్ చట్టసభ సభ్యులకు పిలుపునిచ్చారు.

ఈక్రమంలో గర్భస్రావ హక్కుల గురించి సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై అమెరికా అంతటా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ముసాయిదా లీక్ అయ్యిందని ప్రముఖ వార్తాసంస్థ ‘పొలిటికో’ వెల్లడించింది. జస్టిస్‌ సామ్యూల్‌ ఆలిటో ఈ ముసాయిదాలో కొన్ని కీలక అంశాలను పేర్కొన్నట్టు ఈ కథనంలో పేర్కొంది. ఈ కథనం వెలువరించిన తరువాత నిరసనకారులు కోర్టు వద్దకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

1973లో రో వర్సెస్‌ వాడే కేసులో ఇచ్చిన తీర్పును శామ్యూల్‌ తప్పుగా పేర్కొన్నట్టు వివరించింది. సోమవారం (మే 2,2022) రాత్రి లీక్‌ అయిన ఈ సమాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సుప్రీంకోర్టు నుంచి డాక్యుమెంట్‌ లీక్‌ కావడం ఆధునిక చరిత్రలో ఎప్పుడూ జరుగలేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు