Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత నేను చాలా ఫేమస్ అయ్యాను: ఆస్ట్రేలియా యువకుడు

ఆ ఆస్ట్రేలియా యువకుడికి సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లు పెరిగిపోతున్నారు.

Dylan O Donnell

Chandrayaan-3 : తిరుపతి జిల్లా శ్రీహరికోట(Sriharikota)లోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (Satish Dhawan Space Centre) నుం ఇస్రో (ISRO) చంద్రయాన్‌-3 ప్రయోగించడంతో ప్రపంచ దేశాలు దీన్ని ఆసక్తిగా గమనించాయి. శుక్రవారం ఎల్‌వీఎం 3(LVM 3) వాహకనౌక నింగిలోకి దూసుకెళ్తున్న సమయంలో ఆస్ట్రేలియాలోని యూట్యూబర్ డైలాన్ ఒ డొన్నెల్ తమ దేశం నుంచి తీసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

” భారత అంతరిక్ష సంస్థ చంద్రుడి గుట్టువిప్పేందుకు ప్రయోగించిన రాకెట్ ను యూట్యూబ్ లో చూశాను. ఆ తర్వాత అర్ధగంటకు మా ఇంటి పై కి ఎక్కితే అది ఆకాశమార్గాన కనపడింది. ఇస్రోకు కంగ్రాట్స్. చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని ఆశిస్తున్నాను ” అని చెబుతూ డైలాన్ ఒ డొన్నెల్ ఫొటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటో భారత్ లో బాగా వైరల్ అయింది. దీనిపై డైలాన్ ఒ డొన్నెల్ మళ్లీ స్పందిస్తూ వరుసగా ట్వీట్లు చేశాడు.

తనకు భారత్ నుంచి ఫాలోవర్లు భారీగా పెరిగిపోయారని చెప్పాడు. నిజానికి తన తల్లి బెంగళూరులో జన్మించిందని అన్నాడు. తాను 2006లో ముంబైకి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫొటోను ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత తీసిన ఫొటోతో తనకు చాలా పేరు వచ్చిందంటూ మురిసిపోతున్నాడు.

Chandrayaan: ఇప్పుడు చంద్రయాన్-3 వ్యోమనౌక పరిస్థితి ఎలా ఉందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు