Viral Video: కస్టమర్లను ఐకియా స్టోర్‌లోనే బంధించడానికి అధికారుల యత్నం.. తోసుకుని బయటకు వెళ్ళిన వినియోగదారులు

 కస్టమర్లను ఐకియా స్టోర్‌లోనే బంధించడానికి చైనా అధికారులు ప్రయత్నించారు. దీంతో అధికారులు, సిబ్బందిని తోసుకుని మరీ బయటకు వెళ్ళారు వినియోగదారులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. జుహుయ్ జిల్లాలోని ఐకియా స్టోర్‌కు వెళ్ళివచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని తేలింది. దీంతో వెంటనే ఆ స్టోర్ లోని వారందరినీ ఐసోలేషన్ లో ఉంచాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఐకియా స్టోర్ ద్వారాలు అన్నింటినీ మూసివేయడానికి ప్రయత్నించారు.

Viral Video: కస్టమర్లను ఐకియా స్టోర్‌లోనే బంధించడానికి చైనా అధికారులు ప్రయత్నించారు. దీంతో అధికారులు, సిబ్బందిని తోసుకుని మరీ బయటకు వెళ్ళారు వినియోగదారులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. జుహుయ్ జిల్లాలోని ఐకియా స్టోర్‌కు వెళ్ళివచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని తేలింది. దీంతో వెంటనే ఆ స్టోర్ లోని వారందరినీ ఐసోలేషన్ లో ఉంచాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఐకియా స్టోర్ ద్వారాలు అన్నింటినీ మూసివేయడానికి ప్రయత్నించారు.

ఈ విషయాన్ని గుర్తించిన కస్టమర్లు వెంటనే ద్వారాల వద్దకు పరుగులు తీశారు. అధికారులు ద్వారాలు వేయడానికి ప్రయత్నిస్తుండగా, వాటిని తోసుకుని మరీ బయటకు వెళ్ళారు కస్టమర్లు. ఈ ఘటనపై ఐకియా స్టోర్ ప్రతినిధులు ఇప్పటివరకు స్పందించలేదు. షాంఘైలో జనాభా అధికంగా ఉంటుంది. కరోనాను ఎదుర్కొనేందుకు చైనా జీరో-కొవిడ్ విధానాన్ని పాటిస్తోంది.

ప్ర‌పంచం మొత్తం హెర్డ్ ఇమ్యూనిటీ వంటి విధానాల‌ను పాటిస్తుంటే చైనా అందుకు భిన్నంగా ఒక్క కేసు కూడా తమ దేశంలో ఉండకూడదని ఈ విధానాన్ని అవలంబిస్తోంది. తమ దేశం అనుస‌రిస్తోన్న జీరో-కొవిడ్ పాల‌సీ వల్లే ప్ర‌జ‌ల ప్రాణాల‌ను, ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని చైనా ప్రభుత్వం అంటోంది. జీరో-కొవిడ్ విధానంలో భాగంగా చైనా కఠిన ఆంక్షలు విధిస్తుండడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

China-Taiwan conflict: చెప్పినట్టుగానే మళ్ళీ తైవాన్ చుట్టూ పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు ప్రారంభించిన చైనా

ట్రెండింగ్ వార్తలు