Anti-Taliban Fighters: వారి ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్‌ను కాపాడుకుంటాం

అఫ్ఘానిస్తాన్‌కు చెందిన పంజ్‌షీర్ ప్రాంత వాసులు ఛాలెంజ్ విసురుతున్నారు. తాలిబాన్ల ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్ ను కాపాడుకుంటామని అంటున్నారు.

Anti-Taliban Fighters: అఫ్ఘానిస్తాన్‌కు చెందిన పంజ్‌షీర్ ప్రాంత వాసులు ఛాలెంజ్ విసురుతున్నారు. తాలిబాన్ల ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్ ను కాపాడుకుంటామని అంటున్నారు. చేతులు పైకెత్తుతూ అల్లాహ్ ఓ అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ సవాల్ విసురుతున్నారని స్థానికులు అంటున్నారు.

పంజ్‌షీర్ ప్రాంతాన్ని కాపాడుకునే క్రమంలో చాలా కాలం తర్వాత భారీ మెషీన్ గన్‌తో లోయలోకి కాల్పులు జరిపారు. ఈ ఫైటర్లంతా నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ (ఎన్ఆర్ఎఫ్)కు చెందిన వారు. తాలిబాన్లు కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత మిగిలిన బలమైన ఫోర్స్ ఇదే.

కాబూల్ కు 90మైళ్ల దూరంలో ఉన్న హిందూ కుష్ పర్వతాలలో ఈ లోయ ఉంది. దీనినే స్థావరంగా చేసుకుని పోరాటం చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వం అంతటినీ చేజిక్కించుకున్నప్పటికీ ఈ లోయా ప్రాంతంపై అధికారం రాబట్టలేకపోయారు తాలిబాన్లు.

తాలిబాన్ దాడిని అడ్డుకోవడానికి ఎన్ఆర్ఎఫ్ భారీ మెషీన్ గన్ లే రెడీ గా ఉంచింది. శాండ్ బ్యాగ్స్ తో ప్రొటెక్ట్ చేసుకుంటూ.. స్టేషన్లు మానిటరింగ్ చేసుకుంటున్నారు. అమెరికా తయారీ చేసిన వాహనాల్లో పాట్రోలింగ్ చేసుకుంటూ.. పికప్ ట్రక్స్ లో మెషీన్ గన్స్ వేసుకుని తిరుగుతున్నారు. తాలిబాన్లకు ధీటుగా పోరాడి ఛాలెంజ్ విసరగలరని స్థానిక మీడియా చెప్పుకొచ్చింది.

ట్రెండింగ్ వార్తలు