World Bank : సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌ దేశానికి ప్రపంచ బ్యాంకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, అభివృద్ధి అనుకూలతకు ఆర్థికంగా తగినంత ప్రజా వనరులతో సహా అనేక ఆర్థిక కష్టాలను పాకిస్తాన్ ఎదుర్కొంటుందని ప్రపంచ బ్యాంక్ అధికారులు తెలిపారు....

Pakistan

World Bank : సాధారణ ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌ దేశానికి ప్రపంచ బ్యాంకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, అభివృద్ధి అనుకూలతకు ఆర్థికంగా తగినంత ప్రజా వనరులతో సహా అనేక ఆర్థిక కష్టాలను పాకిస్తాన్ ఎదుర్కొంటుందని ప్రపంచ బ్యాంక్ అధికారులు తెలిపారు. (Ahead Of General Polls) తీవ్ర ద్రవ్యోల్బణంతో పాకిస్థాన్ భారీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. (World Banks Warning To Pakistan) ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎన్నికల తర్వాత రాబోయే ప్రభుత్వమైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

Sharad Pawar : గుజరాత్‌లో లాక్టోఫెర్రిన్ ప్లాంట్‌‌కు శరద్ పవార్ ప్రారంభోత్సవం

పాకిస్థాన్ దేశంలో సైనిక, రాజకీయ విధాన నిర్ణయాలు నేతల స్వార్థ ప్రయోజనాలతో ప్రభావితమవుతున్నాయని పాకిస్తాన్‌లోని ప్రపంచ బ్యాంకు యొక్క కంట్రీ డైరెక్టర్ నజీ బాన్‌హాస్సిన్ వ్యాఖ్యానించారు. ‘‘పాకిస్థాన్ దేశం సంక్షోభం అంచున ఉంది, దేశంలో 40 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. సైనిక, రాజకీయ వ్యాపార, నాయకుల స్వార్థ ప్రయోజనాలతో తీసుకునే విధాన నిర్ణయాల వల్ల దేశం వెనుకబడి పోతుందని, ఈ మార్గాన్ని మార్చుకోవాలి’’ అని ప్రపంచబ్యాంకు సూచించింది.

Vikas Raj : తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు : ఎన్నికల అధికారి వికాస్ రాజ్

పాకిస్థాన్ దేశం మూలధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 2000, 2020 మధ్యకాలంలో పాకిస్థాన్ దేశం సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు కేవలం 1.7 శాతం మాత్రమే ఉంది. పాకిస్థానీ రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది.

ట్రెండింగ్ వార్తలు