Elon Musk : 7 నిమిషాల్లో ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్.. సీన్ కట్ చేస్తే

ఆదాయ కార్యకలాపాలు లేకపోవడం వల్ల...మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని, అందువల్లన అన్ లిమిటెడ్ మనీ లిమిటెడ్ ను అత్యవసరంగా రద్దు చేయాలని అధికారులు సిఫార్సు చేశారు.

UK-Based YouTuber : ఎవరికైనా ధనవంతులు కావాలని అనిపిస్తుంది. ఇందుకు కొంతమంది చాలా కష్టపడుతుంటారు. మరికొంతమంది అక్రమ మార్గంలో, అవినీతి పనులు చేస్తూ… ధనవంతులు అవుతుంటారు. కానీ.. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడుగా పేరు ఉన్న ఎలన్ మస్క్ కే షాక్ ఇచ్చాడు ఓ యువకుడు. మస్క్ ను ఏకంగా సెకండ్ ప్లేస్ లోకి నెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 7 నిమిషాల్లోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డులెక్కాడు. సీన్ కట్ చేస్తే.. ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌కు ఓ యువకుడు మాక్స్ ఫోష్ షాకిచ్చాడు. అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్న మస్క్‌ను సెకండ్‌ ప్లేస్‌లోకి నెట్టేసి అగ్రస్థానాన్ని అధిష్టించాడు.

Read More : BIS..FFP2 S Mask : బీఐఎస్ ఆమోదించిన మాస్క్..‘FFP2 S.. N95 కంటే మెరుగైన రక్షణ

ఎలాంటి ఆదాయ కార్యకలాపాలు లేకుండానే అత్యంత సంపన్నుడయ్యాడు. బ్రిటన్‌కు చెందిన యూట్యూబర్‌ మాక్స్ ఫోష్… 7 నిమిషాలపాటు ప్రపంచంలోనే రిచెస్ట్‌ పర్సన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. కంపెనీ పేరుకు చివర లిమిటెడ్ తో ముగియాలని తెలిసిందే. మార్కెట్ క్యాపిటలైజేషన్‌ లొసుగును ఉపయోగించుకున్న మాక్స్… అన్‌లిమిటెడ్‌ మనీలిమిటెడ్ పేరిట ఓ కంపెనీ స్థాపించాడు. ఒక్కో షేరును 50 పౌండ్లకు విక్రయించడం ద్వారా మొత్తం 500బిలియన్ పౌండ్లు ఆర్జించాడు. మనీ టేబుల్‌లో కొద్దినిమిషాలు ఫస్ట్‌ప్లేస్‌లో నిలిచాడు.

Read More : Russia and Ukraine : యుక్రెయిన్‌‌లో నర్సరీ స్కూల్‌‌పై బాంబుల వర్షం

ఆదాయ కార్యకలాపాలు లేకపోవడం వల్ల…మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయని, అందువల్లన అన్ లిమిటెడ్ మనీ లిమిటెడ్ ను అత్యవసరంగా రద్దు చేయాలని అధికారులు సిఫార్సు చేశారు.  మోసపూరిత చర్య బయటపడటంతో వెంటనే తన కంపెనీని రద్దు చేశాడు. ఇటు ఎలన్‌మస్క్‌ వివాదంలో చిక్కుకున్నారు. కెనడాలో టీకా నిబంధనలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ట్రక్కర్లకు మద్దతుగా నిలిచి .. విమర్శలు ఎదుర్కొంటున్నారు. కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడోను అడాల్ఫ్‌ హిట్లర్‌తో పోలుస్తూ బుధవారం ట్వీట్‌ చేశారు మస్క్‌. ఇది చాలా వైరల్‌గా మారింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. మస్క్‌ ట్వీట్‌పై అమెరికన్‌ యూదు కమిటీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని కోరింది. దీంతో ఆ ట్వీట్‌ను మస్క్‌ తొలగించారు.

ట్రెండింగ్ వార్తలు