Bharat Jodo Yatra: జమ్మూలో వరుస బాంబు పేలుళ్లు.. అయిననూ భారత్ జోడో యాత్ర సాగుతుందన్న కాంగ్రెస్

జమ్మూలోని నర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా, రాహుల్ యాత్ర ప్రస్తుతం జమ్మూలోని ఛాద్వాల్ ప్రాంతంలో కొనసాగుతోంది. జోడో యాత్ర ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి, బాంబు పేలుళ్లు సంభవించిన ప్రాంతానికి కేవలం 60 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇకపోతే, పేలుళ్లు ఎవరికి కారణంగా జరిగాయి, వాటి వెనుక ఉద్దేశాలేంటనే విషయం ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు తెలిపారు.

Bharat Jodo Yatra: శనివారం ఉదయం జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఏడుగురు గాయపడ్డట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అక్కడ రాహుల్ గాంధీ నాయకత్వంలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. తాజా సంఘటనతో యాత్రను ఆపేయొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే యాత్ర కొనసాగుతుందని, ఆపే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఈ యాత్ర జనవరి 30న శ్రీనగర్ చేరుకోవడంతో ముగుస్తుంది. ప్రస్తుతం జమ్మూలో ఉన్న ఈ యాత్రకు శనివారం విశ్రాంతి ఇచ్చారు. ఆదివారం ఉదయమే ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Student Suicide In IFLU :హైదరాబాద్ ఇఫ్లూ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య

జమ్మూలోని నర్వాల్ పారిశ్రామిక ప్రాంతంలో ఈ పేలుళ్లు సంభవించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా, రాహుల్ యాత్ర ప్రస్తుతం జమ్మూలోని ఛాద్వాల్ ప్రాంతంలో కొనసాగుతోంది. జోడో యాత్ర ప్రస్తుతం ఉన్న ప్రదేశానికి, బాంబు పేలుళ్లు సంభవించిన ప్రాంతానికి కేవలం 60 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఇకపోతే, పేలుళ్లు ఎవరికి కారణంగా జరిగాయి, వాటి వెనుక ఉద్దేశాలేంటనే విషయం ఇంకా స్పష్టం కాలేదని పోలీసులు తెలిపారు. ఫొరెనిక్స్ నిపుణులు పేలుడు ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారని, వారిచ్చే వివరాల ఆధారంగా విచారణ చేపట్టి అసలు విషయాన్ని తెలుసుకుంటామని వారు పేర్కొన్నారు.

Maharashtra: శరద్ పవార్‭పై ప్రశంసలు కురిపించిన మహారాష్ట్ర సీఎం షిండే

కాగా, ఈ విషయమై జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పందిస్తూ ‘‘ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడడం వారిలోని (పేలుళ్లకు కారణమైనవారు) నిస్పృహను, పిరికితనాన్ని ఎత్తిచూపుతున్నాయి. దీనిపై వెంటనే కఠిన చర్య తీసుకోండి. నేరస్తులను చట్టానికి అప్పగించే ఎటువంటి ప్రయత్నాలను వదిలిపెట్టకూడదు’’ అని జమ్మూ కశ్మీర్ పోలీసులను ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు