Laal Singh Chaddha : ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్న అమీర్ ఖాన్, చిరంజీవి..

ఆదివారం సాయంత్రం లాల్ సింగ్ చద్దా ప్రెస్ మీట్ జరుగగా దీనికి చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి అమీర్ ఖాన్ గురించి, అతని సినిమాల గురించి గొప్పగా మాట్లాడారు. ఈ సినిమా ట్రైలర్ లో హీరో పానీపూరి తినే ఒక సీన్ ఉంటుంది.....

Chiranjeevi :  అమీర్ ఖాన్ హీరోగా, నాగ చైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్న సినిమా లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల తెలుగు సినిమాలు బాగా హిట్ అవుతుండటంతో బాలీవుడ్ సినిమాలన్నీ తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇక లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగ చైతన్య కూడా ఉండటంతో తెలుగులో కూడా ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేస్తున్నారు.

ఆదివారం సాయంత్రం లాల్ సింగ్ చద్దా ప్రెస్ మీట్ జరుగగా దీనికి చిరంజీవి ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో చిరంజీవి అమీర్ ఖాన్ గురించి, అతని సినిమాల గురించి గొప్పగా మాట్లాడారు. ఈ సినిమా ట్రైలర్ లో హీరో పానీపూరి తినే ఒక సీన్ ఉంటుంది. ప్రెస్ మీట్ లో ట్రైలర్ ప్లే చేసిన తర్వాత ఈవెంట్ నిర్వాహకులు స్టేజిపై ఉన్న నాగ చైతన్య, అమీర్ ఖాన్, చిరంజీవికి పానీపూరి ఇవ్వగా చిరు, అమీర్ ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్నారు. దీంతో ఈ వీడియో బాగా వైరల్ గా మారింది.

Raviteja : రామారావు ఆన్ డ్యూటీ టికెట్ రేట్స్ ఇవే.. ఇంకా తగ్గవా??

పానీపూరి తిన్న తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన తర్వాత పానీపూరి తినాలి అనిపించింది. వీళ్ళు ఇలా ఇచ్చేసరికి నా కోరిక తీరిపోయింది అని అన్నారు. లాల్ సింగ్ చద్దా సినిమా ఆగస్టు 11న రిలీజ్ అవ్వనుంది.

ట్రెండింగ్ వార్తలు