Aatmanirbhar Bharat: ప్రపంచంలోనే అతిపెద్ద OLA ప్లాంట్‌లో 10వేల మంది మహిళలకు ఉద్యోగాలు

మిళనాడులోని ఓలా మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మొత్తం మహిళలతోనే రన్ చేయాలని ఓలా ఛైర్మన్, గ్రూప్ సీఈఓ భవిష్ అగర్వాల్ సోమవారం ప్రకటించారు.

Aatmanirbhar Bharat: తమిళనాడులోని ఓలా మ్యాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ మొత్తం మహిళలతోనే రన్ చేయాలని ఓలా ఛైర్మన్, గ్రూప్ సీఈఓ భవిష్ అగర్వాల్ సోమవారం ప్రకటించారు. ప్రపంచంలోనే మహిళలతో రన్ అయ్యే అతి పెద్ద ఫ్యాక్టరీగా మారనుందని భవిష్ అభివర్ణించారు. ఈ సందర్భంగానే ఆత్మనిర్భర్ భారత్‌కు ఆత్మనిర్భర్ ఉమెన్ గా అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

మొత్తం 500ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీ ప్లాంట్‌లో 10వేల మంది మహిళలకు ఉద్యోగాలు కల్పించనున్నారు. పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ మొదలైన తర్వాత ఇది సాధ్యపడుతుంది. ఓలా గతేడాది తమిళనాడులో పెట్టబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యాక్టరీకి 2వేల 400కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

ముందుగా దీని కోసం సంవత్సరానికి 10లక్షల వార్షిక ప్రొడక్షన్ కెపాసిటీతో మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత క్రమంగా మార్కెట్ డిమాండ్ ను బట్టి 20లక్షల వరకూ పెంచనున్నామని వెల్లడించింది. ఇదంతా తొలి దశలో మాత్రమే.

కంప్లీట్ అయిన తర్వాత ఓలా సంవత్సరానికి కోటి యూనిట్లు ఉత్పత్తి చేయగలదని చెప్పారు. అంటే ప్రపంచంలో జరిగే టూవీలర్ ప్రొడక్షన్ లో 15శాతం అన్నమాట. మహిళలకు ఆర్థికంగా అవకాశాలు కల్పించడానికి మేం చేసిన మొదటి వర్క్ ఫోర్స్ అని భవిష్ అభివర్ణించారు. ఇండియాను నైపుణ్యంతో మార్చడానికి ఉద్యోగాభివృద్ధి పెంచడానికి మహిళా వర్క్ ఫోర్స్ పెంచాల్సి ఉందని ఆయన అన్నారు.

ట్రెండింగ్ వార్తలు