Muslim Sculptor హర్యానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ్య సభ్యుడు రామ్ చందర్ జంగ్రా ముస్లిం శిల్పులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ లో ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాంచందర్ జంగ్రా.. శిల్పులు, శిల్పాల గురించి మాట్లాడుతూ.. ముస్లిం శిల్పులందరూ లార్డ్(దేవుడు) విశ్వకర్మ వారసులేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొగల్ చక్రవర్తి బాబర్ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన వెంట శిల్పులను తెచ్చుకోలేదన్నారు .
ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ఎటుచూసినా ఇసుక దిబ్బలు,ఆయిల్ మాత్రమే కనిపిస్తాయని, అక్కడ శిల్పకళ అనేదే లేదని రామ్ చందర్ జంగ్రా చెప్పారు. కాబట్టి ప్రపంచంలోని ముస్లిం శిల్పులంతా విశ్వకర్మ వారసులేనన్నారు. కాగా, జంగ్రా వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.