Project K : ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి ఆనంద్ మహేంద్ర.. నాగ్ అశ్విన్ ట్వీట్‌కి రిప్లై..

ఇటీవల ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్ ద్వారా ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ''అమితాబ్, ప్రభాస్, దీపీక లాంటి అగ్ర తారలతో అత్యంత భారీ బడ్జెట్‌తో...........

Anand Mahindra :  పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నుంచి ‘రాధేశ్యామ్’ త్వరలో రిలీజ్ అవ్వనుంది. ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల్లో ‘ప్రాజెక్టు K’ ఒకటి. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ ప్రతిష్ఠాత్మక 50వ సినిమాగా నిర్మిస్తోంది. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనె, అమితాబ్ లాంటి బాలీవుడ్ స్టార్లు సైతం నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ‘ప్రాజెక్టు K’ షూటింగ్ దశలో ఉంది.

అయితే ఇటీవల ఈ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్ ద్వారా ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో.. ”అమితాబ్, ప్రభాస్, దీపీక లాంటి అగ్ర తారలతో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘ప్రాజెక్ట్ K’ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ఈ సినిమాకి అత్యాధునికమైన కొన్ని వెహికల్స్ కావాలి, మన దగ్గర అద్భుతమైన ఇంజనీర్స్ ఉంటారు, వారిని మేము ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాము. ఇందుకు మీ సాయం కావాలి. ఈ సినిమా రిలీజ్ అయితే దేశానికి ఎంతో గర్వ కారణంగా నిలుస్తుంది” అంటూ ఆనంద్ మహీంద్రాని కోరారు.

Khiladi : రవితేజ ‘ఖిలాడీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఆనంద్ మహీంద్రా దేశం కోసం, పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గతంలో చాలా సార్లు వార్తల్లో నిలిచారు. సహాయం చేయడానికి, సపోర్ట్ చేయడానికి ఈయన ఎప్పుడూ ముందు ఉంటారు. తాజాగా నాగ్ అశ్విన్ ట్వీట్ చూసి ఈ ట్వీట్ కి రిప్లై ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ”ఇంత అద్బుతమైన అవకాశాన్ని ఎలా వదులుకుంటాం నాగ్ అశ్విన్. మా గ్లోబల్ ప్రొడెక్ట్ డెవలప్‌మెంట్ ఛీఫ్ వేలు మహీంద్ర మీకు కావాల్సిన సహకారాన్ని అందిస్తారు. తను ఇప్పటికే అద్భుతమైన వెహికల్ ఎక్స్‌యువీ 700 కారును రూపొందించారు” అంటూ ట్వీట్ చేశారు మహీంద్ర.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ నుంచి ర్యాప్ సాంగ్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన తమన్..

దీంతో ఆనంద్ మహీంద్రా కూడా ‘ప్రాజెక్టు K’ సినిమాలో భాగమవ్వనున్నారు. ఈ ట్వీట్స్ తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ‘ప్రాజెక్టు K’ వచ్చే సంవత్సరం రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు