Anupam Kher : రవీంద్రనాధ్ ఠాగూర్ గా అనుపమ్ ఖేర్.. ఈ ఫోటో చూశారా? అచ్చు దింపేశారు..

తాజాగా అనుపమ్ ఖేర్ రవీంద్రనాధ్ ఠాగూర్ లుక్ లో మేకప్ వేసుకున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తూ అచ్చు నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగే ఉన్నారు.

Anupam Kher doing Rabindranath Tagore Biopic He post a photo looks like same Rabindranath Tagore

Anupam Kher :  ఇటీవల అన్ని సినీ పరిశ్రమలలో బయోపిక్ లు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో అయితే చెప్పనవసరం లేదు. వరుస బయోపిక్స్ తెరకెక్కుతూనే ఉన్నాయి. తాజాగా మరో బయోపిక్ రాబోతున్నట్టు సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ ప్రకటించారు.

ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అనుపమ్ ఖేర్. ఇటీవల కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 సినిమాలతో ఒక్కసారిగా దేశమంతా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలు అనుపమ్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాయి. వీటి తర్వాత మరిన్ని మంచి మంచి పాత్రలు వస్తున్నాయి.

Project K T-shirt : ‘ప్రాజెక్ట్ K’ టీ ష‌ర్ట్ కావాలా.. అయితే ఇలా చేయండి

తాజాగా అనుపమ్ ఖేర్ రవీంద్రనాధ్ ఠాగూర్ లుక్ లో మేకప్ వేసుకున్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటో చూస్తూ అచ్చు నిజంగా రవీంద్రనాథ్ ఠాగూర్ లాగే ఉన్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. గురుదేవ్, కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పాత్రను నా 538వ సినిమాలో పోషించడం చాలా గర్వంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియచేస్తాము అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అనుపమ్ ఖేర్. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. బాలీవుడ్ లో త్వరలో రవీంద్రనాథ్ ఠాగూర్ బయోపిక్ రానున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఫొటో చూసినవాళ్లంతో మరోసారి అనుపమ్ ఖేర్ డెడికేషన్ ని అభినందిస్తున్నారు. ఈ వయసులో కూడా ఒక పాత్రకోసం అంత కష్టపడుతున్నారు అంటూ అభినందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు