Bandla Ganesh : తల్లి తండ్రులు నాకు జన్మనిస్తే.. పవన్ కళ్యాణ్ నాకు బతుకునిచ్చాడు.. బండ్ల గణేష్ కొత్త స్పీచ్ వైరల్..

చాలా రోజుల తర్వాత బండ్ల గణేష్ పవన్ సినిమా వేడుకకు వస్తుండటంతో, గబ్బర్ సింగ్ తన సినిమానే కావడంతో ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ స్పీచ్ కోసం అందరూ ఎదురుచూసారు.

Bandla Ganesh Viral Speech in Gabbar Singh Re Release Press Meet

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు గబ్బర్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి హరీష్ శంకర్, బండ్ల గణేష్ తో పాటు పలువురు గబ్బర్ సింగ్ సినిమాకు పనిచేసిన వ్యక్తులు వచ్చారు. చాలా రోజుల తర్వాత బండ్ల గణేష్ పవన్ సినిమా వేడుకకు వస్తుండటంతో, గబ్బర్ సింగ్ తన సినిమానే కావడంతో ఈ ఈవెంట్లో బండ్ల గణేష్ స్పీచ్ కోసం అందరూ ఎదురుచూసారు.

Also Read : Sekhar – Ganesh : స్టేజిపై ఎమోషనల్ అయిన గణేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్.. అప్పటి రోజులను గుర్తుచేసుకొని..

బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. నా తల్లి తండ్రులు నాకు జన్మనిస్తే పవన్ కళ్యాణ్ నాకు బతుకునిచ్చాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే నేను చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ మిగిలిపోయేవాడిని. పవన్ కళ్యాణ్ ఒకరోజు నన్ను పిలిచి నిర్మాతగా సినిమాలు చేస్తావా? చెయ్యి అని చెప్పారు. హిందువులకు భగవద్గీత, ముస్లిమ్స్ కి ఖురాన్, క్రైస్తవులకు బైబిల్ ఎంత పవిత్రమో పవన్ ఫ్యాన్స్ కి కూడా గబ్బర్ సింగ్ అంతా పవిత్రమైనది. ఈ సినిమా క్రెడిట్ అంతా హరీష్ శంకర్ కి దక్కాలి. హరీష్ ఏం చెప్తే పవన్ అదే చేసారు. హరీష్ శంకర్ ని సరిగ్గా వాడుకోవట్లేదు అని పవన్ హరీష్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నటించారు. పవన్ కళ్యాణ్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ హ్యాపీగా బతకగలిగినా అవన్నీ వదిలేసి పదేళ్లు పోరాడి పోరాడి ఇవాళ ఒక స్థాయిలో ఉన్నారు. ఆయన నిజాయితీ, నీతి కలిగిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాని రీ రిలీజ్ చేయాలని సంవత్సరం ముందే అనుకున్నాం. ఈ సినిమా షూటింగ్ లో హీరో గుర్రం మీద నుంచి పడిపోబోయాడు గుజరాత్ షూట్ లో. ప్రాణం పోయేది, అందరం భయపడ్డారు. ఇప్పుడు గబ్బర్ సింగ్ రిలీజ్ అప్పుడు ఉన్నట్టే క్రేజ్ ఉంది. ఇప్పుడు తెలుగు సినిమాలు, డైరెక్టర్స్, నిర్మాతలు దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో నేను ఏడేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాను. మళ్ళీ సినిమాల్లోకి వచ్చి మళ్ళీ సినిమాలు తీస్తాను. పరమేశ్వర ఆర్ట్స్ అంటే మళ్ళీ సూపర్ హిట్ సినిమాలు తీసేలా చేస్తాను. సినిమానే నా జీవితం అంటూ పవన్ కళ్యాణ్, గబ్బర్ సింగ్ గురించి మాట్లాడారు. మీరు కూడా బండ్ల గణేష్ ఫుల్ స్పీచ్ వినేయండి..

 

ట్రెండింగ్ వార్తలు