Pranayagodari Movie Item Song Released by Ganesh Master
Pranayagodari Song : కమెడియన్ అలీ సోదరుని తనయుడు సదన్ హీరోగా ‘ప్రణయగోదారి’ అనే సినిమాతో రాబోతున్నాడు. సదన్, ప్రియాంక ప్రసాద్ జంటగా PL విఘ్నేష్ దర్శకత్వంలో పిఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై పారమళ్ళ లింగయ్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సునీల్ రావినూతల, 30 ఇయర్స్ పృథ్వీ, సాయి కుమార్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ప్రణయ గోదారి సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది.
ఆల్రెడీ ప్రణయ గోదారి సినిమా నుంచి పలు సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమాలోని ఐటం సాంగ్ రిలీజ్ చేసారు. ఈ పాటను మార్కండేయ రాసి సంగీతం అందించాడు. భార్గవి పిల్లై ఈ పాటను పాడింది. ఈ సాంగ్ లో మాధురి మొండాల్ నర్తించింది. మీరు కూడా ఈ ఐటెం సాంగ్ వినేయండి..
ఇక ప్రణయగోదారిలోని ఈ ఐటెం సాంగ్ ని ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ రిలీజ్ చేసారు. పాట రిలీజ్ అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. ప్రణయ గోదారి సినిమాలోని గు గు గ్గు… అనే ఐటెం సాంగ్ వినడానికి బాగుంది. ఈ సాంగ్ లోని హుక్ స్టెప్స్ బాగున్నాయి. విఘ్నేశ్ గారు తెరకెక్కించిన ప్రణయ గోదావరి మంచి సక్సెస్ అవ్వాలి అని అన్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.