Nani – Bigg Boss 8 : బిగ్‌బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్‌కి గెస్ట్ గా హీరో నాని.. మరోసారి ఒకే స్టేజిపై ఇద్దరు హోస్ట్‌లు..

నాని ఆల్రెడీ గతంలో బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Nani – Bigg Boss 8 : బిగ్‌బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్‌కి గెస్ట్ గా హీరో నాని.. మరోసారి ఒకే స్టేజిపై ఇద్దరు హోస్ట్‌లు..

Natural Star Nani as Guest for Bigg Boss Telugu Season 8 Opening Episode Rumours goes Viral

Updated On : August 31, 2024 / 3:13 PM IST

Nani – Bigg Boss 8 : బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1న ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ ఎపిసోడ్ తో మొదలుకానుంది. ఇప్పటికే నాగార్జున హోస్ట్ గా ప్రోమోలు రిలీజ్ చేసారు. బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రేపు మొదలు కానున్న బిగ్ బాస్ లోకి ఎవరెవరు కంటెస్టెంట్స్ గా వెళ్తున్నారో అని ఆసక్తి నెలకొంది.

కంటెస్టెంట్స్ గురించి పక్కన పెడితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ రేపటి ఓపెనింగ్ ఎపిసోడ్ కి హీరో నాని గెస్ట్ గా రాబోతున్నాడట. తాజాగా నాని సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో నడుస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని బిగ్ బాస్ లోకి రానున్నాడట. నాని బిగ్ బాస్ లోకి వచ్చే ఎపిసోడ్ నేడు షూట్ జరుగుతుందని సమాచారం.

Also Read : Bandla Ganesh : త్రివిక్ర‌మ్‌తో వివాదం.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బండ్ల‌ గ‌ణేష్‌

నాని ఆల్రెడీ గతంలో బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగార్జున హోస్ట్ చేస్తున్నప్పుడు నాని పలుమార్లు గెస్ట్ గా వచ్చి అలరించాడు. ఇప్పుడు మరోసారి ఈ సీజన్ 8 లో ఓపెనింగ్ ఎపిసోడ్ లోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో స్టేజిపై ప్రస్తుత హోస్ట్ మాజీ హోస్ట్ నాగార్జున, నాని ఇద్దరూ కలిసి ఓపెనింగ్ రోజు సందడి చేయనున్నారు.