Bandla Ganesh : త్రివిక్ర‌మ్‌తో వివాదం.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బండ్ల‌ గ‌ణేష్‌

ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘

Bandla Ganesh : త్రివిక్ర‌మ్‌తో వివాదం.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బండ్ల‌ గ‌ణేష్‌

Bandla Ganesh apologized to Director Trivikram Srinivas

Updated On : August 31, 2024 / 2:50 PM IST

Bandla Ganesh – Trivikram Srinivas : ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఓ అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్‌లో ఉండి నోరు జారాన‌ని అన్నారు. చాలా పెద్ద తప్పు చేశాన‌ని తెలిపారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న గ‌బ్బ‌ర్ సింగ్‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నేడు గ‌బ్బ‌ర్ సింగ్ ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు.

ఈ ఈవెంట్‌లో ఓ రిపోర్ట‌ర్ తీన్ మార్ చిత్రం గురించి ఓ ప్ర‌శ్న అడుగ‌గా.. గబ్బ‌ర్ సింగ్ అవ‌కాశం ఎలా వ‌చ్చిందో చెబుతూ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు బండ్ల గ‌ణేశ్‌. గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ త‌న‌కు రావ‌డానికి కార‌ణం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అని అన్నారు. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ అవ‌కాశం ఇచ్చి త‌న జీవితాన్ని మార్చేశార‌ని బండ్ల గ‌ణేష్ తెలిపారు.

Bandla Ganesh – Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ సీట్స్ ఇరగ్గొడతారు థియేటర్స్ ఇవ్వం అంటున్న ఎగ్జిబిటర్స్.. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసిన బండ్లన్న..

భీమ్లానాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స‌మ‌యంలో బండ్ల గ‌ణేష్ ఆడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావ‌డం లేదా అని ఓ అభిమాని ఫోన్ చేసి అడుగ‌గా ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న‌ను ఈవెంట్‌కు రానివ్వ‌డం లేద‌ని అన్నారు. తొలుత తాను ఈ వ్యాఖ్య‌లు అన‌లేద‌ని అన్నా.. ఆ త‌రువాత ఒప్పుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పారు బండ్ల‌గ‌ణేష్‌. తాజాగా మ‌రోసారి దీనిపై స్పందించారు.