Bandla Ganesh – Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ సీట్స్ ఇరగ్గొడతారు థియేటర్స్ ఇవ్వం అంటున్న ఎగ్జిబిటర్స్.. ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసిన బండ్లన్న..
పవన్ సినిమా రీ రిలీజ్ కి థియేటర్స్ దొరకట్లేదట. కొంతమంది ఎగ్జిబిటర్లు థియేటర్స్ ఇవ్వట్లేదట. తాజాగా దీనిపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు.

Bandla Ganesh Request to Exhibitors for Gabbar Singh Re Release Theaters
Bandla Ganesh – Pawan Kalyan : స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ చేస్తారని తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాములు హడావిడి ఉండదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పవన్ సినిమా రీ రిలీజ్ కి థియేటర్స్ దొరకట్లేదట. కొంతమంది ఎగ్జిబిటర్లు థియేటర్స్ ఇవ్వట్లేదట. పవన్ ఫ్యాన్స్ రచ్చ చేసి థియేటర్స్ నాశనం చేస్తారు, సీట్స్ ఇరగ్గొడతారు అని థియేటర్స్ ఇవ్వము అని చెప్తున్నారంట.
తాజాగా దీనిపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించాడు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీట్స్ ఇరగ్గొడతారు థియేటర్స్ ఇవ్వము అని ఎగ్జిబిటర్స్ అంటున్నారు. దయచేసి అడుగుతున్నాను థియేటర్స్ ఇవ్వండి. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు మారారు. మా వాళ్ళు సీట్స్ ఇరగ్గొట్టరు. మా బాస్ మొన్నటిదాకా పవర్ స్టార్ అప్పుడు రచ్చ వేరు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం పద్దతిగా ఉంటారు. మాకు బాధ్యత ఉంది. ఒక పవన్ అభిమానిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గబ్బర్ సింగ్ సినిమాకు థియేటర్స్ ఇవ్వండి. ఉదయం గుడికి వెళ్లి పవన్ కళ్యాణ్ బాగుండాలని దండం పెట్టుకొని తర్వాత థియేటర్ కి వచ్చి గబ్బర్ సింగ్ సినిమా చూస్తాం మా ఫ్యాన్స్ అంతా. తమ్ముళ్లు మీరు కూడా థియేటర్స్ లో సీట్స్ ఇరగ్గొట్టకండి ఇప్పుడు మన బాస్ పొజిషన్ వేరు, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు. మరి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి అనుకున్నానని థియేటర్స్ వస్తాయా చూడాలి.