AP New Governor: ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీ సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశారు.

AP New Governor: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుత ఏపీ గవర్నర్‌గాఉన్న బిస్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియామకం అయ్యారు. ఏపీ సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా నియామకం అయిన జస్టిస్ అబ్దుల్ నజీర్ అయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‍‌లో ఒకరు.

 

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణన్ మాథుర్ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు. వారి స్థానంలో మహారాష్ట్ర గవర్నర్‌గా రమేశ్ బైస్, లడఖ్ గవర్నర్‌గా బీడీ మిశ్రాను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.  మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటానని కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన భగత్‭సింగ్ కోశ్యారీ.. తాజాగా అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా, ఆమె ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్‭గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అనేక రాజకీయ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మేలు చేసే విధంగా ప్రవర్తించారని, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయి. ఇక ఛత్రపతి శివాజీ మీద కోశ్యారీ చేసిన వ్యాఖ్యల అనంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం లేసింది. ఈ కాంట్రవర్సీ కారణంగానే పదవీ కాలం పూర్తి కాకముందే రాజీనామా చేసినట్లు విమర్శకులు అంటున్నారు.

 

కొత్త గవర్నర్లు వీరే..

1. అరుణాచల్ ప్రదేశ్ – లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్.
2. సిక్కిం – లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
3. జార్ఖండ్ – సీపీ రాధాకృష్ణన్
4. హిమాచల్ ప్రదేశ్ – శివ్ ప్రతాప్ శుక్లా
5. అసోం – గులాబ్ చంద్ కటారియా
6,. ఆంధ్రప్రదేశ్ – రిటైర్డ్ జస్టీస్ ఎస్. అబ్దుల్ నజీర్
7. ఛత్తీస్‌గడ్ – బిస్వభూషణ్ హరిచందన్
8. మణిపూర్ – అనసూయ
9. నాగాలాండ్ – గణేషన్
10. మేఘాలయా – ఫగు చౌహాన్
11. బీహార్ – రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
12. మహారాష్ట్ర – రమేశ్ బైస్
13. లడఖ్ – బీడీ మిశ్రా

ట్రెండింగ్ వార్తలు