Assam CM : వరంగల్‌‌లో బీజేపీ సభ..పోలీసుల భారీ బందోబస్తు

జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న సీఎం కావడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వరంగల్ నగరంలో పోలీసు బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు...

Warangal BJP : జీవో నంబర్‌ 317పై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని డిసైడ్‌ అయ్యింది బీజేపీ. దశలవారీగా సర్కార్‌పై పోరును చేసేందుకు రెడీ అవుతోంది. ఉద్యోగుల బదిలీలపై విడుదల చేసిన జీవో 317ను సవరించాలని , లేదంటే రద్దు చేయాలని బీజేపీ కోరుతోంది. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకూడదని భావిస్తోంది. పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా వరంగల్‌లో సభను నిర్వహిస్తోంది బీజేపీ. ఈ సభకు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హాజరవుతున్నారు. ఈనెల 11న మహబూబ్‌నగర్‌లోనూ సభ నిర్వహించనుంది కమలం పార్టీ.

Read More : Brazil: బ్రెజిల్‌లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి

ఈ సభకు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ హాజరుకాబోతున్నట్టు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ తెలిపారు. జీవో 317ను సవరించేదాకా సర్కార్‌తో తెగించి కొట్లాడుతామన్నారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్ లో బీజీపీ నేతృత్వంలో ఈ సభ జరుగనుంది. సభకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల బీజేపీ శ్రేణులు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పట్టణాన్ని జెండాలతో అలంకరించారు. అస్సాం సీఎం, తెలంగాణ బీజేపీ చీఫ్ రాకతో కట్టుదిట్టమైన భద్రత చేపట్టింది పోలీస్ శాఖ.

Read More : Road Accident: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను బలిగొన్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం

జెడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న సీఎం కావడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వరంగల్ నగరంలో పోలీసు బలగాలు, స్పెషల్ పార్టీ పోలీసులు మోహరించాయి. అడుగడుగునా పోలీసు భద్రత ఉంది. బీజేపీ సభా స్థలి హంటర్ రోడ్డులోని విష్ణుప్రియాగార్డెన్ పోలీసులు పరిశీలించారు. హన్మకొండ బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మతో పోలీసులు చర్చించారు. సీఎం హిమంత బిశ్వశర్మ రాక సందర్భంగా అస్సోం నుంచి ప్రత్యేక భద్రతా అధికారులు వరంగల్ కు వచ్చారు.

ట్రెండింగ్ వార్తలు