Road Accident: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ను బలిగొన్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం

టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ నగరం, కే.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది

Road Accident: టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. హైదరాబాద్ నగరం, కే.పి.హెచ్.బి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్ లారీ ఢీకొని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. కే.పీ.హెచ్.బి కాలనీ రోడ్డు నెంబర్ 1 నుండి టెంపుల్ బస్ స్టాప్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డిని.. అతివేగంతో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. దీంతో జగన్మోహన్ రెడ్డి కిందపడిపోగా.. కింద చిక్కుకున్న అతన్ని టిప్పర్ 20 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. నిర్లక్ష్యంగా టిప్పర్ ని నడిపిన డ్రైవర్.. ఏం జరిగిందో కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు.

Also read: Google Issue: గూగుల్ పై విచారణకు ఆదేశించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)

ప్రమాదంపై స్థానికులు స్పందించి కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద అనంతరం పరారైన టిప్పర్ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఇటీవలి కాలంలో టిప్పర్ వాహనాలు, భవననిర్మాణానికి చెందిన వాహనాలు.. ఇష్టారీతిన తిరుగుతున్నాయి. ప్రధానంగా జేఎన్టీయూ, నిజాంపేట్, కే.పీ.హెచ్.బి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో టిప్పర్ లారీలు అతివేగంతో దూసుకెళ్తూ ఇతర వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సరైన సమయపాలన విధించాలని స్థానికులు కోరుతున్నారు.

Also read: Anand Mahindra: ట్విట్టర్ యూజర్ ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా అదిరిపోయే సమాధానం

ట్రెండింగ్ వార్తలు