Bandi Sanjay: టీడీపీ-బీజేపీ మళ్లీ కలుస్తాయన్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చిన బండి సంజయ్

బీజేపీ జిల్లా నేతల టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్ మాట్లాడారు.

Bandi Sanjay – BJP: కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah), బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సమావేశమై చర్చించిన అంశంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. టీడీపీ-బీజేపీ పొత్తు ఊహగానాలేనని కొట్టి పడేశారు. బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు కలిస్తే తప్పేంటి? అని అన్నారు.

బీజేపీ జిల్లా నేతల టెలికాన్ఫరెన్స్ లో బండి సంజయ్ మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వంటి వారూ కలిశారని గుర్తు చేశారు.

ప్రతిపక్షాలను, ప్రజలను కలవకుండా కేసీఆర్ మాత్రమే ఉంటారని, ఆయనలా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ తమది కాదని చెప్పుకొచ్చారు. బీజేపీ నేతలను చంద్రబాబు కలవడంతో ఊహాజనిత కథనాలు వస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో బీజేపీ బలం పెరుగుతోందని బండి సంజయ్ చెప్పారు. బీజేపీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. కాగా, బీజేపీ అధిష్ఠానాన్ని చంద్రబాబు కలవడంతో మళ్లీ ఎన్డీఏలో టీడీపీ చేరుతుందని ప్రచారం జరుగుతోంది.

Chandrababu : ముగిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటన.. త్వరలో టీడీపీ, బీజేపీ పొత్తుపై క్లారిటీ

ట్రెండింగ్ వార్తలు