Beijing : వింటర్ ఒలింపిక్స్ ఏర్పాట్లు..బబూల్‌‌లో వేలాది మంది

చైనాలో ఫిబ్రవరి 4నుంచి 20 వరకు వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. దీంతో బీజింగ్‌లో అడుగుపెట్టనున్న దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు, సిబ్బంది, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు తదితరులూ

Beijing Olympics 2022 : కరోనా వైరస్‌పై కఠినంగా వ్యవహరిస్తూనే.. వింటర్‌ ఒలింపిక్స్‌కు ఏర్పాట్లు ముమ్మరం చేసింది చైనా. తాజాగా.. క్రీడా వేదికలు, రవాణా, సిబ్బంది నిర్వహణ పనులు మొదలుపెట్టింది. వైరస్‌ దరిచేరకుండా ఉండేందుకు వేలకొద్ది సిబ్బంది, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు తదితరులను క్లోజ్డ్ లూప్‌లో ప్రవేశపెట్టింది. కొన్ని వారాలపాటు వారు అందులోనే ఉండనున్నారు.

Read More : Balakrishna : మాస్ డైరెక్టర్‌తో మరో సినిమా ఓకే చేసిన బాలయ్య

చైనాలో ఫిబ్రవరి 4నుంచి 20 వరకు వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. దీంతో బీజింగ్‌లో అడుగుపెట్టనున్న దాదాపు మూడు వేల మంది అథ్లెట్లు, సిబ్బంది, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు తదితరులూ బబుల్‌లో ఉండనున్నారు. రోజూ వారికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వింటర్‌ ఒలింపిక్స్ నిర్వహణ ఏర్పాట్లు కొలిక్కి వచ్చినట్లు ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడించింది.

Read More : Elon Musk : టెస్లాను మూసేయండి.. చైనాలో ఎలన్‌ మస్క్‌పై విమర్శలు!

క్రీడా వేదికలు, హోటళ్లు, రవాణా అన్నీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. వేదికలు బీజింగ్‌ వెలుపల ఉండటంతో.. రాకపోకలకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అయితే, చైనాలోని విదేశీ దౌత్యవేత్తలు మాత్రం.. ఒలింపిక్స్‌ విషయంలో ప్రభుత్వ ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయని వాపోతున్నారు. ఇలాగైతే బబుల్‌లోని తమ జాతీయులకు సరైన సాయం అందించలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు