Bhagwant Mann : ఆప్ అధినేత కేజ్రీవాల్ తో భగవంత్ మాన్ భేటీ.. పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ

ప్రభుత్వ ఏర్పాటుపై భగవంత్ మాన్ రేపు గవర్నర్ ను కలవనున్నారు. మార్చి 13న అమృత్ సర్ లో కేజ్రీవాల్ తో కలిసి భగవంత్ మాన్ భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు.

Bhagwant Mann meet Kejriwal : పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింత్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. మరికొద్ది సేపట్లో చండీగఢ్ లో ఆప్ లెజిస్లే టివ్ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో భగవంత్ మాన్ ను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు.

ప్రభుత్వ ఏర్పాటుపై భగవంత్ మాన్ రేపు గవర్నర్ ను కలవనున్నారు. మార్చి 13న అమృత్ సర్ లో కేజ్రీవాల్ తో కలిసి భగవంత్ మాన్ భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు. ఈ నెల 16న ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భగత్ సింగ్ పుట్టిన స్వగ్రామంలో భగవంత్ మాన్ ప్రమాణం చేయనున్నారు.

AAP Punjab : పంజాబ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన ఆప్‌.. జాతీయ పార్టీలను ఊడ్చి పారేసిన ‘చీపురు’

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పై ఘన విజయం సాధించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 92 సీట్లను గెలుచుకుంది. ఆప్ చరిత్ర సృష్టించింది. ఆప్ పార్టీ ఢిల్లీ తర్వాత అధికారంలోకి రానున్న రెండో రాష్ట్రం పంజాబ్. ప్రజలు ఆప్ కు అద్భుతమైన విజయం కట్టబెట్టడంతో భగవంత్ మాన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని రాజ్ భవన్ లో కాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్ లో చేయాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఉంచకూడదని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలను మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లు భగవంత్ మాన్ వెల్లడించారు.

Punjab : పంజాబ్‌కా షాన్‌.. పంజాబ్‌కా షేర్.. హాస్యనటుడు నుంచి ముఖ్యమంత్రి వరకు ప్రస్థానం

ఇక పంజాబ్ కు పునర్ వైభవం తీసుకొచ్చేవిధంగా పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆప్ వెల్లడించింది. ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణం నుంచి ఎన్నికల్లో హామీలను అమలు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలను స్థితిగతులను మెరుగుపరచడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడం, పరిశ్రమలను తీసుకురావడం, సాగును లాభసాటిగా మార్చడం, మహిళలకు భద్రత కల్పించడం, క్రీడా మౌలిక సదుపాయాలను పెంచడం వంటి పలు అంశాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

ట్రెండింగ్ వార్తలు