Bomb Threat : బెంగళూరులో ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్

ఇప్పటిరవకు అయితే ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదని పోలీసులు తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Bomb threat mails : కర్నాటక స్కూళ్లలో హిజాబ్ వివాదం కొనసాగుతుండగానే బాంబు బెదిరింపులు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. బెంగళూరులోని ఏడు పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు మెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను స్కూళ్లను ఖాళీ చేయించారు. స్కూళ్లలో బాంబు స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తోన్నారు.

ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటిరవకు అయితే ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదని పోలీసులు తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులో బాంబు బెదిరింపులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.

Railway stations Bomb threats : బాంబులతో పేల్చివేస్తామంటూ 8 రైల్వే స్టేషన్లకు బెదిరింపులు..అధికారులు అప్రమత్తం

కర్నాటకలో గత కొన్ని రోజులుగా కూడా హిజాబ్ పై వివాదం నడుస్తోంది. దీంతోపాటు తాజాగా హలాల్, హజాన్ పై కూడా రగడ నడుస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన అల్ ఖైదా హిజాబ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. దీనిపై కర్నాటక సీఎం బొమ్మై ఇప్పటికే విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చారు.

ఇలాంటి సమయంలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కల్గిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వాతావరణం అక్కడ నెలకొంది. ప్రభుత్వం పోలీసులను పూర్తిగా అప్రమత్తం చేసింది. అన్ని పాఠశాలలను ఖాళీ చేయిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు