Sam Curran Apologize : క్ష‌మించండి.. వ‌చ్చే ఏడాది మా స‌త్తా చూపిస్తాం : సామ్ క‌ర‌న్‌

ఐపీఎల్ 17 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ క‌థ ముగిసింది.

Sam Curran : ఐపీఎల్ 17వ‌ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ క‌థ ముగిసింది. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో బెంగ‌ళూరు చేతిలో ఓడిపోయింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు కెప్టెన్ సామ్ క‌ర‌న్ మాట్లాడుతూ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం చాలా బాధగా ఉంద‌న్నాడు. అభిమానులు క్ష‌మించాల‌ని కోరారు. వ‌చ్చే బ‌లంగా తిరిగి వ‌స్తామ‌ని, ఈ సీజ‌న్‌లో మిగిలిన మ్యాచుల్లో పోరాడుతామ‌న్నాడు.

ఈ సీజ‌న్‌లో కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయ‌ని, కొన్ని మ్యాచుల్లో దుర‌దృష్ట‌వ‌శాత్తు ఓడిపోయామ‌ని చెప్పాడు. ఇక జ‌ట్టును న‌డిపించ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌న్నాడు. వైఫ‌ల్యానికి శిఖ‌ర్ ధావన్ దూరమయ్యాడని చెప్ప‌డం స‌రికాద‌ని, జ‌ట్టులో ఉత్త‌మ ఆట‌గాళ్లు చాలా మంది ఉన్నార‌న్నాడు. ఈ సీజ‌న్‌లో కొన్ని ఘ‌న‌త‌ల‌ను సాధించాం. రికార్డు ఛేజింగ్ చేశాం. అయిన‌ప్ప‌టికీ గ‌మ్యాన్ని చేరుకోక‌పోవ‌డం బాధ క‌లిగించింది. ఇందుకు అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా అని సామ్ క‌ర‌న్ అన్నాడు.

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి మ‌రో జట్టు అధికారికంగా నిష్క్రమణ

పంజాబ్ కింగ్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచులు ఆడింది. నాలుగు మ్యాచుల్లో గెల‌వ‌గా 8 మ్యాచుల్లో ఓడిపోయింది. పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. ఈ సీజ‌న్‌లో ఇంకో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇందులో గెలిచినా ఓడినా పంజాబ్‌కు వ‌చ్చేది ఏమీ ఉండ‌దు. అయితే.. మిగిలిన జ‌ట్ల ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను మాత్రం ప్ర‌భావితం చేయొచ్చు. మిగిలిన మ్యాచుల్లో గెలిచి పాయింట్ల ప‌ట్టిక‌లో త‌మ స్థానాన్ని కాస్త మెరుగుప‌ర‌చుకోవ‌చ్చు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత బెంగ‌ళూరు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 92) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. రజత్ పటిదార్ (23 బంతుల్లో 55), కామెరూన్ గ్రీన్ (27 బంతుల్లో 46) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, అరంగేట్ర ప్లేయర్ విద్వాత్ కవెరప్ప రెండు వికెట్లతో రాణించాడు.

KL Rahul : స‌న్‌రైజ‌ర్స్ పై ఘోర ఓట‌మి.. ల‌క్నో య‌జ‌మాని సీరియ‌స్‌..! కెప్టెన్‌గా త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌?

అనంతరం ల‌క్ష్య ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ 17 ఓవర్లలో 181 పరుగులకు కుప్ప‌కూలింది. రిలీ రొసో ( 27 బంతుల్లో 61 ) ఒంట‌రి పోరాటం చేశాడు. ఆర్‌సీబీ బౌల‌ర్ల‌లో సిరాజ్ మూడు వికెట్లు, స్వప్నిల్ సింగ్, ఫెర్గూసన్, కర్ణ్ శర్మ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

ట్రెండింగ్ వార్తలు