KL Rahul : స‌న్‌రైజ‌ర్స్ పై ఘోర ఓట‌మి.. ల‌క్నో య‌జ‌మాని సీరియ‌స్‌..! కెప్టెన్‌గా త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ రేసులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కాస్త వెనుక‌బ‌డింది.

KL Rahul : స‌న్‌రైజ‌ర్స్ పై ఘోర ఓట‌మి.. ల‌క్నో య‌జ‌మాని సీరియ‌స్‌..! కెప్టెన్‌గా త‌ప్పుకోనున్న కేఎల్ రాహుల్‌?

After SRH Thrashing KL Rahul To Step Down From LSG Captaincy

LSG Captain KL Rahul : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్ రేసులో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ కాస్త వెనుక‌బ‌డింది. ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచులు ఆడిన ల‌క్నో 6 మ్యాచుల్లో గెలిచి 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఆరో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సిన‌ ప‌రిస్థితి నెల‌కొని ఉంది. ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిచినా ఇత‌ర జ‌ట్ల స‌మీక‌ర‌ణాల ఆధారంగానే ల‌క్నో ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు ఆధార‌ప‌డి ఉంటాయి.

ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచుల్లో ల‌క్నో జ‌ట్టు చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 167 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కాపాడుకోలేక‌పోయింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 89 నాటౌట్‌), అభిషేక్ శ‌ర్మ (28 బంతుల్లో 75) దంచికొట్ట‌డంతో 10 ఓవ‌ర్ల‌లోపే ఎస్ఆర్‌హెచ్‌ విజ‌యాన్ని అందుకుంది. మ్యాచ్ అనంత‌రం ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గోయెంకా కోపంగా కేఎల్ రాహుల్‌తో మాట్లాడిన వీడియో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే.

Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ భ‌విత‌వ్యం పై పాక్ దిగ్గ‌జం వ‌సీం అక్ర‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

వారిద్ద‌రి మ‌ధ్య ఏం చ‌ర్చ జ‌రిగింద‌నే విష‌యం తెలియ‌న‌ప్ప‌టికీ కూడా మిగిలిన రెండు మ్యాచుల్లో కేఎల్ రాహుల్ ఆడ‌తాడా? లేదా అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి. స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో రాహుల్ 33 బంతులు ఎదుర్కొని కేవ‌లం 29 ప‌రుగులే చేశాడు. ఓటమికి రాహుల్ స్లో ఇన్నింగ్స్ కూడా ఓ కార‌ణ‌మ‌ని క్రికెట్ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో రాహుల్ కెప్టెన్సీని వ‌దిలి వేసి త‌న బ్యాటింగ్ పై దృష్టి సారించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

కాగా.. 2022 వేలంలో ల‌క్నో రూ.17కోట్ల‌కు కేఎల్ రాహుల్ ను సొంతం చేసుకుంది. అయితే.. 2025 మెగా వేలానికి ముందు అత‌డిని వ‌దిలివేయవ‌చ్చున‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మిగిలిన రెండు మ్యాచుల్లో ల‌క్నో ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా అది ఉంటుంద‌ని అంటున్నారు. కాగా.. ల‌క్నో త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను ఢిల్లీతో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌కు మ‌రో ఐదు రోజుల స‌మ‌యం ఉంది. ఇప్ప‌టికిప్పుడే రాహుల్ నిర్ణ‌యం తీసుకోక‌పోయినా మ‌రో రెండు మూడు రోజుల్లో కెప్టెన్సీ పై నిర్ణ‌యం తీసుకోనే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కెప్టెన్‌గా రాహుల్ త‌ప్పుకుంటాను అంటే అందుకు ల‌క్నో యాజ‌మాన్యం ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌ద‌ని తెలుస్తోంది.

Babar Azam : బాబ‌ర్.. నువ్వు వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు కొడితే.. నా ఛాన‌ల్ మూసేస్తా : పాక్ కెప్టెన్‌కు స‌వాల్ విసిరిన అలీ

కాగా.. ఈ సీజ‌న్‌లో కేఎల్ రాహుల్ 12 మ్యాచుల్లో 460 ప‌రుగులు చేశాడు. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ రాణిస్తే 500 ప‌రుగుల మైలురాయిని చేరుకోవ‌డం పెద్ద క‌ష్టం కాదు. అయితే.. అత‌డి స్ట్రైక్ రేటు 136.09 కావ‌డం స‌మ‌స్య‌గా మారింది. లక్నో మే 14న న్యూఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 17న వాంఖడేలో ముంబై ఇండియన్స్‌తో మ్యాచులు ఆడ‌నుంది.

ఒకవేళ రాహుల్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవాల‌ని భావిస్తే.. ఈ సీజ‌న్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న వైస్ కెప్టెన్ నికోల‌స్ పూర‌న్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అందుకునే అవ‌కాశం ఉంది.