Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ భ‌విత‌వ్యం పై పాక్ దిగ్గ‌జం వ‌సీం అక్ర‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

రోహిత్ శ‌ర్మ ఐపీఎల్ భ‌విత‌వ్యం పై పాకిస్తాన్ దిగ్గ‌జ ఆట‌గాడు వ‌సీం అక్ర‌మ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

Rohit Sharma : ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ భ‌విత‌వ్యం పై పాక్ దిగ్గ‌జం వ‌సీం అక్ర‌మ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Wasim Akram prediction Rohit won't be at MI next year

Rohit Sharma – Wasim Akram : టీమ్ఇండియా కెప్టెన్‌, ముంబై ఇండియ‌న్స్ స్టార్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ ఐపీఎల్ భ‌విత‌వ్యం పై పాకిస్తాన్ దిగ్గ‌జ ఆట‌గాడు వ‌సీం అక్ర‌మ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సీజ‌న్‌కు ముందు హిట్‌మ్యాన్‌ను సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్థానంలో హార్దిక్‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. వ‌చ్చే సీజ‌న్‌కు ముందు మెగా వేలం జ‌ర‌గ‌నుంది. కాగా..రోహిత్ ముంబై ను వీడ‌నున్నాడు అనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో అక్ర‌మ్ వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

త‌న‌కు తెలిసి వ‌చ్చే సీజ‌న్‌లో రోహిత్ శ‌ర్మ ముంబైకి ఆడ‌క‌పోవ‌చ్చున‌ని అక్ర‌మ్ అన్నాడు. అత‌డిని కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టులో చూడాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌సులోని కోరిక‌ను చెప్పాడు. అత‌డు కేకేఆర్ త‌రుపున ఓపెన‌ర్‌గా రావాల‌ని సూచించాడు. ఓపెన‌ర్‌గా రోహిత్, మెంటార్‌గా గంభీర్‌, కెప్టెన్‌గా అయ్య‌ర్.. ఈ కాంబినేష‌న్‌ను ఊహించుకుంటేనే ఎంతో బాగుంద‌న్నాడు. కోల్‌క‌తా బ్యాటింగ్ లైన‌ప్ బాగుంద‌ని, ఈడెన్ గార్డెన్స్‌లో రోహిత్ రాణిస్తాడ‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నాడు.

Babar Azam : బాబ‌ర్.. నువ్వు వ‌రుస‌గా మూడు సిక్స‌ర్లు కొడితే.. నా ఛాన‌ల్ మూసేస్తా : పాక్ కెప్టెన్‌కు స‌వాల్ విసిరిన అలీ

ఈడెన్ గార్డెన్స్ లో రోహిత్ అల‌వోక‌గా భారీ ఇన్నింగ్స్‌లు ఆడేస్తాడ‌ని జోస్యం చెప్పాడు. రోహిత్ ఎంతో గొప్ప ఆట‌గాడ‌ని, అందుక‌నే అత‌డిని కేకేఆర్ త‌రుపున చూడాల‌ని ఉంద‌ని అక్ర‌మ్ అన్నాడు. కాగా.. కేకేఆర్ పై రోహిత్ శ‌ర్మ 33 మ్యాచులు ఆడి 1051 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, 6 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. ఇక ఈడెన్ గార్డెన్స్‌లో రోహిత్ 13 మ్యాచ్‌లు ఆడిన 466 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 109 కావ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. గౌత‌మ్ గంభీర్ మెంటార్‌గా వ‌చ్చిన త‌రువాత కోల్‌క‌తా ప్ర‌ద‌ర్శ‌న మెరుగైంద‌ని అక్ర‌మ్ చెప్పుకొచ్చాడు. ఈ సీజ‌న్‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంద‌న్నాడు. ఇక శ్రేయ‌స్ అయ్య‌ర్ కూడా జ‌ట్టును స‌రైన దారిలో న‌డిపిస్తున్నాడ‌ని కితాబు ఇచ్చాడు. ఈ సీజ‌న్‌లో కోల్‌క‌తా ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచులు ఆడింది. 8 మ్యాచుల్లో గెలిచి 16 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. మిగిలిన మూడు మ్యాచుల్లో ఒక్క మ్యాచులో గెలిచినా కూడా ప్లే ఆఫ్స్ లో స్థానం ఖ‌రారు చేసుకుంటుంది.

Sanju Samson : ఎవ‌రైనా అంపైర్‌తో వాగ్వాదం చేస్తే.. శిక్ష ఇలాగే ఉంటుంది.. సంజూకు బీసీసీఐ షాక్‌

ఇక ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు విష‌యానికి వ‌స్తే ఈ సీజ‌న్‌లో ఎలిమినేట్ అయిన మొద‌టి జ‌ట్టుగా నిలిచింది. 12 మ్యాచులు ఆడ‌గా 4 మ్యాచుల్లోనే గెలిచింది. ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది.