Bombay HC: టైరు పేలడం దేవుడి మహిమ కాదు కదా.. కంపెనీని రూ.1.25 కోట్లు ఇవ్వమన్న కోర్టు

2010 అక్టోబరు 25న మకరంద్‌ పట్వర్దన్‌ (38) ఇద్దరితో పుణె నుంచి ముంబయికి కారులో బయల్దేరారు. ఆ కారు ఆయన సహచరునిదే. ఆ సహచరుడే డ్రైవింగ్‌ చేశాడు. అయితే వెనుక టైరు పేలడంతో కారు లోయలో పడి పట్వర్దన్‌ మరణించాడు

Bombay HC: టైరు పేలి జరిగిన ప్రమాదంలో టైర్ కంపెనీని 1.25 కోట్ల రూపాయలు చెల్లించమని బాంబే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. టైరు పేలడం కారణంగా ప్రమాదం జరిగి, మరణం సంభవిస్తే అది దైవ ఘటన కిందికి రాదని, దానిని మానవ తప్పిదంగానే పరిగణించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. టైర్ పేలిన దుర్ఘటనలో మరణించిన ఓ వ్యక్తి కుటుంబానికి 1.25 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీని ఆదేశించింది.

Congress on Modi: నువ్వు జస్ట్ ప్రధానివి మాత్రమే.. రాహుల్ గాంధీపై విమర్శలకు మోదీపై కాంగ్రెస్ రియాక్షన్

ఇదే విషయాన్ని పేర్కొంటూ మోటారు ప్రమాదాల క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును బాంబే హైకోర్టు సమర్థించింది. 2010 అక్టోబరు 25న మకరంద్‌ పట్వర్దన్‌ (38) ఇద్దరితో పుణె నుంచి ముంబయికి కారులో బయల్దేరారు. ఆ కారు ఆయన సహచరునిదే. ఆ సహచరుడే డ్రైవింగ్‌ చేశాడు. అయితే వెనుక టైరు పేలడంతో కారు లోయలో పడి పట్వర్దన్‌ మరణించాడు. దీంతో బీమా పరిహారం చెల్లించేలా న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీని ఆదేశించాలని పట్వర్దన్‌ కుటుంబ సభ్యులు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. 1.25కోట్ల రూపాయలు చెల్లించాలని 2016లో ట్రైబ్యునల్‌ ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ ఆ బీమా కంపెనీ హైకోర్టులో అప్పీలు చేసింది. కానీ, హైకోర్టు కూడా ట్రైబ్యునల్‌ తీర్పునే సమర్థించింది.

UP IPS: రూ.20 లక్షలు లంచం తీసుకున్న ఐపీఎస్ అధికారి.. గంటల వ్యవధిలోనే విచారణ ప్రారంభించిన ప్రభుత్వం

ట్రెండింగ్ వార్తలు