Congress on Modi: నువ్వు జస్ట్ ప్రధానివి మాత్రమే.. రాహుల్ గాంధీపై విమర్శలకు మోదీపై కాంగ్రెస్ రియాక్షన్

భారతదేశ గొప్ప సంప్రదాయాలను, దాని పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘బసవేశ్వరుని విగ్రహం లండన్‌లో ఉంది. కానీ అదే లండన్‌లో భారతదేశ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం. మన శతాబ్దాల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్య మూలాలు పండించబడ్డాయి. ఈ ప్రపంచంలో ఏ శక్తి భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను దెబ్బతీయదు. అయినప్పటికీ, కొందరు దీనిని నిరంతరం కొలిమిలో నిలబెడుతున్నారు” అని ప్రధాని మోదీ అన్నారు.

Congress on Modi: ఇటీవల బ్రిటన్ పర్యటనలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం క్రూరమైన దాడికి గురవుతోందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య భారతీయ సంప్రదాయాన్ని, పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అన్నారు. కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రతి దాడి తీవ్ర స్థాయిలో చేసింది. ప్రధాని విధానాలపై విమర్శలు ఎప్పటి నుంచి దేశంపై విమర్శగా మారాయని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. ‘‘మీ విధానాలపై విమర్శలు ఎప్పటి నుంచి దేశానికి విమర్శగా మారాయి? మీరు కేవలం ప్రధానమంత్రి మాత్రమే, మీరే దేశం కాదు, దేవుడు కాదు, సృష్టికర్త కాదు’’ అని కాంగ్రెస్ అధినేత పవన్ ఖేరా ఆదివారం అన్నారు.

Tamil Nadu: చీట్ చేసిన బాయ్ ఫ్రెండ్ మీద వేడి నూనె పోసిన యువతి

కర్ణాటకలో నిర్వహించిన ఓ కార్యక్రమంల ప్రధానమంత్రి ప్రసంగిస్తూ తన బ్రిటన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఇది 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ గొప్ప సంప్రదాయాలను, దాని పౌరులను అవమానించడమేనని ప్రధాని మోదీ అభివర్ణించారు. ‘‘బసవేశ్వరుని విగ్రహం లండన్‌లో ఉంది. కానీ అదే లండన్‌లో భారతదేశ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు తలెత్తడం దురదృష్టకరం. మన శతాబ్దాల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్య మూలాలు పండించబడ్డాయి. ఈ ప్రపంచంలో ఏ శక్తి భారతదేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను దెబ్బతీయదు. అయినప్పటికీ, కొందరు దీనిని నిరంతరం కొలిమిలో నిలబెడుతున్నారు” అని ప్రధాని మోదీ అన్నారు.

Guneet Monga : రెండు సార్లు ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ..

కాగా మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. ప్రజాస్వామ్యంపై దాడి చేసేది ప్రధానేనని, అందుకే దానిపై చర్చలు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ దేశంలోని పెద్దలను, పూర్వీకులను విమర్శించడానికే ప్రధాని తొమ్మిదేళ్ల సమయాన్ని వృధా చేశారని పవన్ ఖేరా దుయ్యబట్టారు. “గత 70 ఏళ్లలో ఏమీ జరగలేదని మీరు (ప్రధానమంత్రి) మూడు తరాలను అవమానించారు. అప్పుడు మీరు దేశ ప్రతిష్ట గురించి పట్టించుకోరు. ‘ఏక్ అకేలా సబ్ పర్ భరీ’ అని పార్లమెంటులో మీ వెన్ను తట్టుకుంటారు. ప్రపంచం దాన్ని చూసి నవ్వుతోంది” అని ఖేరా అన్నారు.

ట్రెండింగ్ వార్తలు