Brs : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఎన్ని? అవి ఏవి?

కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అంచనా వేస్తున్న గులాబీ దళం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చే అవకాశం ఉందని ఆశిస్తోంది. దీనికి తోడు బీజేపీకి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ కే మేలు చేస్తుందనే అభిప్రాయానికి వస్తోంది.

Brs : లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ధీటుగా ఫలితాలను సాధిస్తామని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. పోలింగ్ సరళిని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు.. గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలపై లెక్కలు వేసుకుంటున్నారు. హైదరాబాద్ మినహాయించి మిగిలిన 16 స్థానాల్లో పోలింగ్ జరిగిన తీరుపై బీఆర్ఎస్ స్వాగతిస్తోంది. సైలెంట్ ఓటింగ్ తమకే లాభిస్తుందని ఆశిస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం.

రాష్ట్రంలో దాదాపు 2 నెలల క్రితం మొదలైన పార్లమెంట్ ఎన్నికల సందడి ముగిసింది. పోలింగ్ ముగియడంతో నేతలు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఓటర్ల నాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకుగాను ఎంఐఎం కంచుకోట హైదరాబాద్ ను మినహాయించి.. మిగిలిన స్థానాలపై ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. విజయం కోసం నువ్వా? నేనా? అన్నట్లు పోటీపడ్డాయి. పోలింగ్ ముగిసిన అనంతరం వస్తున్న సమాచారంతో పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు ఆ పార్టీ నేతలు. డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకుంటామని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.

అయితే వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తున్న కొందరు నేతలు మాత్రం ఆరు నుంచి ఏడు స్థానాల్లో విజయావకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. కరీంనగర్, మెదక్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని.. సికింద్రాబాద్, నిజామాబాద్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నారు. వరంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి పరిశీలిస్తే.. రాజకీయంగా తమకు కలిసి వచ్చేలా ఉందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అంచనా వేస్తున్న గులాబీ దళం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చే అవకాశం ఉందని ఆశిస్తోంది. దీనికి తోడు బీజేపీకి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ కే మేలు చేస్తుందనే అభిప్రాయానికి వస్తోంది.

ప్రధాని మోదీ మానియాతో కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ అభ్యర్థులు పలు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో తలపడ్డారని.. మరికొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఎన్నికలు జరిగాయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రతిపక్ష పార్టీగా ప్రజల మద్దతు కూడగట్టడంలో సక్సెస్ అయ్యామన్న అభిప్రాయానికి వస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

Also Read : మినిమం 9, మ్యాగ్జిమం 13..! కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుందో చెప్పేసిన సీఎం రేవంత్

 

ట్రెండింగ్ వార్తలు