Castor Cultivation : ఖరీఫ్ కు అనువైన ఆముదం రకాలు

ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆముదాన్ని సాగుచేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకూ విత్తుకోవడానికి సమయం ఉంది.

Castor Cultivation : దేశంలో పండించే నూనెగింజల పంటల్లో ఆముదంసాగుకు విశిష్ఠ ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు ఈ పంటను, సాగులో చిట్టచివరి అవకాశంగా భావించేవారు. కానీ నేడు పరిస్థితులు  మారాయి. అధికదిగుబడినిచ్చే వంగడాలు రావడం..  నీటి ఎద్దడిని తట్టుకుని మెట్టప్రాంత రైతులకు మంచి ఆదాయ వనరుగా మారడంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఈ పంటసాగుకు మొగ్గుచూపుతున్నారు. అయితే ఏఏ ప్రాంతాలకు ఎలాంటి రకాలను ఎంచుకోవాలో సూచిస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. కె. సదయ్య.

READ ALSO : Avoid Infections : వర్షాకాలం ఇన్‌ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండాలంటే ?

ఆముదం విస్తీర్ణం, ఉత్పత్తిలో ప్రపంచంలోనే మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 4 లక్షల హెక్టార్లలో సాగవుతుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు కొద్ది విస్తీర్ణంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో సాగవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కొద్ది విస్తీర్ణంలో సాగవుతుంది.

READ ALSO : Types Of Soils : ఏ నేలల్లో ఏఏ పంటలు సాగుచేయాలి ? నేలల రకాలు.. పంటల ఎంపిక

అయితే ఈ ఖరీఫ్ లో రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల చాలా ప్రాంతాల్లో మెట్టపంటలను సకాలంలో విత్తలేకపోయారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆముదాన్ని సాగుచేసుకోవడం ఎంతో మేలు. ఈ పంటను జులై చివరి వరకూ విత్తుకోవడానికి సమయం ఉంది. మురుగు నీరు నిల్వ ఉన్న భూములు, చౌడు భూములు తప్పా, అన్ని నేలలు ఈ పంటకు సాగుకు అనుకూలం. అయితే వర్షధారంగా సాగుచేసే ఆముదంలో రకాల ఎంపిక కీలకం. ఏఏ ప్రాంతాలకు ఎలాంటి రకాలు ఎంచుకోవాలో తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త, డా. కె . సదయ్య.

ట్రెండింగ్ వార్తలు