Kunaram Rice : ఖరీఫ్‍కు అనువైన కూనారం వరి రకాలు

Kunaram Rice : తెలంగాణలో బోర్లు బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు.

Varieties of Kunaram rice suitable for Kharif

Kunaram Rice : ఖరీఫ్ సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో రైతులు ఆయాప్రాంతాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అనేక కొత్త వంగడాలు ప్రస్తతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే పాతవాటిలో కూడా మంచి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన వరి రకాలు వున్నాయి.  సన్నగింజ , దొడ్డుగింజ వరి రకాల్లో కూనారం వరి పరిశోధనా స్థానం రూపొందించిన వంగడాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. మరి వీటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

తెలంగాణలో బోర్లు బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాలపరిమితి గల రకాలను సాగుచేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాలో అధిక శాతం కాలువల కింద వరి సాగవుతుంది కనుక ఖరీఫ్ లో ఎక్కువగా 135 నుండి 160 రోజుల కాలపరిమితి కలిగిన రకాలను సాగుచేస్తారు. అయితే దీర్ఘకాలిక రకాలు సాగుచేసే ప్రాంతంలో ఒకరిద్దరు స్వల్పకాలిక రకాలు సాగుచేస్తే కోత సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందువల్ల ప్రాంతాల వారిగా, సాగుచేసే పరిస్థితులను బట్టి రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా, కూనారం వరి పరిశోధనా స్థానం నుండి ఇటీవల విడుదలైన కె.ఎన్.ఎం -118 ,  కె.ఎన్.ఎం – 733, కె.ఎన్.ఎం -1638 రకాలు మంచి ఆదరణ పొందుతున్నాయి.

ఖరీఫ్, రబీకి అనువైన ఈ రకాల గుణగణాల గురించి శాస్త్రవేత్త శ్రీధర్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన  నారు, వరిలో అధిక దిగుబడికి  సోపానం.  మరి నారు పుష్ఠిగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే , విత్తనశుద్ది, పోషక యాజమాన్యం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

Read Also : Groundnut Cultivation : వేరుశనగ సాగులో మేలైన యాజమాన్యం