Avoid Infections : వర్షాకాలం ఇన్‌ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండాలంటే ?

బలమైన రోగనిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పొవాలి.

rainy season

Avoid Infections : వర్షాకాలంలో అధిక తేమ కారణంగా బ్యాక్టీరియా మరియు వైరస్‌ల పెరుగుదల అధికంగా ఉంటుంది. వర్షాకాలం మండే వేడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది, అదే క్రమంల ఇది గాలిలో తేమ, రోడ్లపై నీటి నిల్వలు బ్యాక్టీరియా , వైరస్ల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం వలన అంటువ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

READ ALSO : Girl Climbs Tower : ప్రియుడిపై కోపంతో 80 అడుగుల ఎత్తైన టవర్ ఎక్కిన ప్రియురాలు

మనలో చాలా మంది వర్షాకాలాన్ని ఇష్టపడతారు. వేసవి వేడి, చెమట నుండి కాస్త ఉపశమనం కావాలని కోరుకుంటారు, అయితే రుతుపవనాల వర్షం కంటి సంబంధిత ఇన్ఫెక్షన్లతో సహా అనేక వ్యాధులను తెచ్చిపెడుతుంది. వర్షకాలంలో వచ్చే వ్యాధులను ఎదుర్కొనాలంటే ఆహారంలో మార్పులతోపాటు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోండి : అంటువ్యాధులను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి మిమ్మల్ని మీరు శుభ్రంగా, పొడిగా ఉంచుకోవడం. రోజూ తలస్నానం చేసిన తరువాత జుట్టుబాగా ఆరబెట్టుకోవాలి. ఎక్కువ సమయం తడి బట్టలు, బూట్లు వంటి వాటిని ధరించడం మానుకోవాలి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల బ్యాక్టీరియాకు సంతానోత్పత్తిని సృష్టికి కారణమవుతాం.

READ ALSO : Banana : వర్షకాలంలో అరటి పండు తినకూడదా ?

స్వచ్ఛమైన నీటిని తాగటం : వర్షాకాలంలో నీటి ద్వారా వచ్చే కలరా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సర్వసాధారణం. శుభ్రమైన , ఫిల్టర్ చేసిన నీటిని మాత్రమే త్రాగటం మంచిది. నీటి నాణ్యత సరిగా లేకపోతే త్రాగడానికి ముందు దానిని మరిగించి చల్లారిన తరువాత తీసుకోవాలి.

ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవటం: వర్షాకాలం ఆహార కాలుష్యం ఎక్కువగా ఉండే సమయం. వీధి ఆహారం , అపరిశుభ్రమైన తినుబండారాలకు దూరంగా ఉండండి. పండ్లు , కూరగాయలు తినే ముందు వాటిని బాగా కడగాలి.

READ ALSO : Swine Flu During Rainy Season : వర్షకాలంలో స్వైన్ ఫ్లూ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు !

రోగనిరోధక శక్తిని పెంచుకోండి: బలమైన రోగనిరోధక వ్యవస్థ అంటువ్యాధులతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తగినంత నిద్ర పొవాలి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి వంటి సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు.

రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటండి: మార్కెట్‌లు, మాల్స్ , ప్రజా రవాణా వంటి రద్దీ ప్రదేశాలు అంటువ్యాధులు ప్రబలేందుకు అవకాశం ఉంటుంది. వీలైతే, వర్షాకాలంలో రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా ఉండండి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి.

READ ALSO : Yogurt Face Pack : వర్షకాలంలో చర్మాన్ని తాజాగా ఉంచే పెరుగు ఫేస్ ప్యాక్!

రోజువారి వ్యాయామాలు ; ఇంటి వద్ద నే రోజువారిగా కొన్ని వ్యాయామాలు చేయటం మంచిది. ఒత్తిడిని నివారించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి. లోతైన శ్వాస వ్యాయామాలను చేయాలి. ఇలా చేయటం వల్ల శారీరకంగా, మానసికంగా ధృడంగా తయారవుతారు

 

 

 

ట్రెండింగ్ వార్తలు