Kumar Vishwas: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ కు “వై: కేటగిరి భద్రత

నిఘావర్గాల అనుమానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ.. విశ్వాస్ కు అపాయం ఉన్న మాట వాస్తవమేనని తేల్చింది. దీంతో ఆయనకు.. సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించారు

Kumar Vishwas: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత కుమార్ విశ్వాస్ కు “వై” కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుందని ఆశాఖ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఇటీవల కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ “పంజాబ్ రాష్ట్రాన్ని విడగొట్టి, ప్రత్యేక ఖలిస్థాన్ దేశానికి ప్రధాని అవుతా అంటూ తనతో అన్నాడని” కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో కుమార్ విశ్వాస్ పై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అదే సమయంలో విశ్వాస్ కు కొన్ని వర్గాల నుంచి ప్రాణాపాయం ఉందని నిఘావర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.

Also read: NIA Conduct Searches : జమ్మూ కశ్మీర్, రాజస్ధాన్ లలో ఎన్ఐఏ సోదాలు

నిఘావర్గాల అనుమానాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ.. విశ్వాస్ కు అపాయం ఉన్న మాట వాస్తవమేనని తేల్చింది. దీంతో ఆయనకు.. సీఆర్పీఎఫ్ బలగాలతో కూడిన వై కేటగిరి భద్రత కల్పించాలని నిర్ణయించారు. వై కేటగిరి భద్రతలో భాగంగా నాలుగు సాయుధ భద్రత సిబ్బంది విశ్వాస్ అంగరక్షుకులుగా పనిచేయనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వీడిన కుమార్ విశ్వాస్.. తరచూ కేజ్రీవాల్ పై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. అయితే పంజాబ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో నిలిచిన తరుణంలో.. ఆపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆదివారం పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి.

Also read: CM MK Stalin : 2లక్షల 50 వేల పుస్తకాలతో అధునాతన లైబ్రరీ నిర్మిస్తున్న సీఎం స్టాలిన్

ట్రెండింగ్ వార్తలు