Chikoti Praveen : రాజకీయాల్లోకి చీకోటి ప్రవీణ్..! బీజేపీలో చేరతారని ప్రచారం.. ఆహ్వానిస్తారా? తిరస్కరిస్తారా?

బీజేపీలో చేరడం ద్వారా మరింతగా హిందుత్వం కోసం, పార్టీ కోసం పని చేస్తాననే ప్రపోజల్ ను బీజేపీ నేతల ముందు ఉంచినట్లుగా తెలుస్తోంది. Chikoti Praveen

Chikoti Praveen Into BJP

Chikoti Praveen Into BJP : క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్(Chikoti Praveen) త్వరలో రాజకీయాల్లోకి రానున్నారు. ఆయన బీజేపీలో(BJP) చేరతారని తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్ ఢిల్లీలో బీజేపీ అగ్ర నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే డీకే అరుణ(DK Aruna), బండి సంజయ్ ను(Bandi Sanjay) కలిశారు. తాను బీజేపీలో చేరతానని నేతలతో చెప్పారు ప్రవీణ్. కాగా, పార్టీలో చర్చించాక చీకోటి ప్రవీణ్ చేరికపై నిర్ణయం తీసుకుంటామని డీకే అరుణ తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. త్వరలోనే చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ జాతీయ నేతల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారని టాక్.

Also Read..Kokapet Lands : వామ్మో.. ఎకరం రూ.72 కోట్లు..! రికార్డు ధర పలుకుతున్న కోకాపేట భూములు

చీకోటి ప్రవీణ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. వరుస పెట్టి బీజేపీ నేతలను ఆయన కలుస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లను గురువారం చీకోటి ప్రవీణ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరిక ప్రపోజల్ ను ఆయన బీజేపీ నేతల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. నేను ఇప్పటికే హిందుత్వం కోసం పని చేస్తున్నాను.. బీజేపీలో చేరడం ద్వారా మరింతగా హిందుత్వం కోసం, పార్టీ కోసం పని చేస్తాను అనే ప్రపోజల్ ను బీజేపీ నేతల ముందు చీకోటి ప్రవీణ్ ఉంచినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చర్చించి చేరికపై నిర్ణయం తీసుకుంటామని చీకోటి ప్రవీణ్ కు డీకే అరుణ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది.(Chikoti Praveen)

కొంతకాలంగా గమనిస్తే హిందుత్వంపై చీకోటి ప్రవీణ్ మాట్లాడుతున్నారు. గోరక్షణ చేస్తామని ప్రకటించారు. దేవాలయాల సందర్శనకు కూడా ప్రవీణ్ వెళ్లారు. వరుసగా ఆలయాల సందర్శన, గోసంరక్షణ, హిందుత్వ కార్యక్రమాలు చేపట్టడం చేశారు. తద్వారా తాను బీజేపీలో చేరతాను అనే సంకేతం పంపారు చీకోటి ప్రవీణ్. తాజాగా ఆయన ఏకంగా బీజేపీ నేతలను కలవడం, తాను బీజేపీలో చేరతాను అనే ప్రపోజల్ ను వారి ముందు ఉంచడం.. ఇవన్నీ చీకోటి ప్రవీణ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది.(Chikoti Praveen)

Also Read..Mobile Charger : గుండెలు పిండే తీవ్ర విషాదం.. ఫోన్ ఛార్జర్ పిన్ నోట్లో పెట్టుకుని 8నెలల చిన్నారి మృతి, తల్లిదండ్రులూ బీకేర్ ఫుల్

ముందు నుంచి కూడా హిందూ భావజాలం ఉన్న వ్యక్తి కావడంతో చీకోటి ప్రవీణ్ బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతుంది. తాజాగా తన మనోగతాన్ని బీజేపీ నేతల ముందు ఉంచారు చీకోటి ప్రవీణ్. అయితే, ఈ ప్రపోజల్ పై బీజేపీ నేతల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. చీకోటి ప్రవీణ్ ను పార్టీలోకి ఆహ్వానించడం కానీ, రిజెక్ట్ చేయడం కానీ ఏదీ చేయలేదు. పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. చీకోటి ప్రవీణ్ బ్యాక్ గ్రౌండ్ ఇష్యూస్ ని దృష్టిలో పెట్టుకుని ఆయనను పార్టీలోకి తీసుకోవాలా? వద్దా? అన్న దానిపై బీజేపీ నేతలు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

చీకోటి ప్రవీణ్ ను పార్టీలోకి బీజేపీ ఆహ్వానిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. చీకోటి ప్రవీణ్ పలు వివాదాల్లో ఉన్నారు. కేసినో కింగ్ గా గుర్తింపు పొందారు. అక్రమంగా క్యాసినోలు నిర్వహించడం, నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణులను పెంచుకోవడం సహా అనేక కేసుల్లో ఉన్నారు. రేషన్ షాపు నిర్వహించడం నుంచి మొదలైన చీకోటి ప్రవీణ్ జీవితం.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఆ తర్వాత క్యాసినోలు నిర్వహించడం, రాజకీయ నేతలు, సెలబ్రిటీలతో సంబంధాలు నెరపడం వరకు సాగింది. మనీలాండరింగ్ వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ పై ఈడీ కేసు కూడా నమోదైంది. ఇక రీసెంట్ గా థాయ్ ల్యాండ్, నేపాల్ దేశాల్లో కేసినో వ్యవహరాల్లో కూడా చీకోటి ప్రవీణ్ పేరు వినిపించింది. ఇలాంటి కాంట్రవర్సీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేపథ్యంలో చీకోటి ప్రవీణ్ ను పార్టీలోకి బీజేపీ ఆహ్వానిస్తుందా? లేక తిరస్కరిస్తుందా? అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.(Chikoti Praveen)

ట్రెండింగ్ వార్తలు