Bandi Sanjay : ఉత్సవాల పేరుతో 5లక్షల కోట్లు అప్పు చేశారు, తెలంగాణ రావొద్దని కోరుకున్నారు- బండి సంజయ్

Bandi Sanjay : సుష్మా స్వరాజ్ గర్జిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చింది. 1400 మంది బలిదానంతో తెలంగాణ వచ్చింది.

Bandi Sanjay (Photo : Twitter)

Bandi Sanjay – CM KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, రూ.5లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని కేసీఆర్ పై ధ్వజమెత్తారు.

మహబుబ్ నగర్ జిల్లా ఆత్మకూరులో బహిరంగసభలో బండి సంజయ్ మాట్లాడారు. మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో మహాసభలు పెడుతున్నాం అని బండి సంజయ్ చెప్పారు. బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశ్యం అని తెలిపారు.

బండి సంజయ్ కామెంట్స్..
” తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీకీ పోయి అడిగితే లక్షల ఇళ్లు కేంద్రం ఇస్తే అవి పేదలకు అందలేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఒక లక్ష 80వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి. రైతులకు రుణమాఫీ చేయలేదు. రైతలను నట్టేట ముంచింది బీఆర్ఎస్ ఫ్రభుత్వం. కరీంనగర్ వచ్చి పంట నష్టపరిహారం ఇస్తానని రైతులను నట్టేట ముంచిన ఘనుడు కేసీఆర్. పారాసిటమాల్ నాయకుడు కేసీఆర్.Bandi Sanjay

Also Read..KTR: తెలంగాణలో ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: కేటీఆర్

కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు ముంచారు. రుణమాఫీ చేయకపోగా ఫ్రీ యూరియా అంటూ రైతులను మభ్యపెడుతున్న మూర్ఖుడు. కేసీఆర్ కుటుంబ పాలనలో పర్సటేంజీల పర్వం కొనసాగుతోంది. బోయలను ఎస్టీలను చేస్తానని మాటతప్పిన ఘనుడు కేసీఆర్. ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన వారిని నడి రోడ్డు మీద నిలబెట్టిన మూర్ఖుడు.

దశాబ్ది ఉత్సవాల పేరుతో రూ.5లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను ఆగం చేసిండు. కేంద్రం ఇచ్చిన నిధులను దాచుకుని ప్రజలను మోసం చేస్తున్న ఘనుడు. పండించిన పంటను కొనలేని చేతకాని ఫ్రభుత్వం బీఆర్ఎస్.

సుష్మా స్వరాజ్ గర్జిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ ఇచ్చింది. 1400 మంది బలిదానంతో తెలంగాణ వచ్చింది. శ్రీకాంతాచారి బలిదానం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ కుటుంబంలో ఎవరూ ఉద్యమం కోసం పోరాడలేదు. యాక్షన్ కింగ్ కేసీఆర్. దొంగ దీక్షతో తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించిన ఘనుడు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రం కోసం దీక్షతో మరో డ్రామాకు తెరలేపిన ఘనుడు. తెలంగాణ రావద్దని కోరుకున్న మొట్టమొదటి మూర్ఖుడు.

పక్క రాష్ట్రాల పర్యటన కోసం రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారు. ఈ సర్కారు డ్రంక్ అండ్ డ్రైవ్ సర్కార్. మందు తాగినోడికి మనం తెలంగాణను అప్పజెప్పాం. కేంద్రం ఇచ్చిన నిధులను ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. మహిళలను గౌరవించ లేని ఫ్రభుత్వం బీఆర్ఎస్. జాకీ పెట్టి లేపినా లేవని పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కు షాపింగ్ మాల్. ఎమ్మెల్యేలను కొనుక్కోవడమే కేసీఆర్ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రంలో బలమైన పార్టీగా బీజేపీ ప్రభుత్వం ఎదుగుతోంది.Bandi Sanjay

Also Read..KCR: సీఎం కేసీఆర్.. మహారాష్ట్రపై ఎందుకు ఎక్కువగా ఫోకస్ పెట్టారంటే..!

బీఆర్ఎస్ పార్టీకి బలమైన ప్రత్యర్థి బీజేపీ. కాంగ్రెస్ పార్టీకీ క్యాడర్ లేదు. క్యాండేట్ లేడు. హైదరాబాద్ లో ముస్లింల బాధలు పట్టించుకోని ఓవైసీ తన ఆస్తులు పెంచుకుంటున్నాడు. రామ రాజ్యం, మోడీ రాజ్యం రావాలి. మనల్ని బట్టలూడదీసి కొడతామన్న వాడిని రోడ్డుమీద బట్టలూడదీసి కొట్టాలి.
బండి సంజయ్ హిందూ సమాజం కోసం ప్రాణాలిస్తాడు. భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోతే మన హిందువులను పట్టించుకునే ఫ్రభుత్వమే లేదు. కర్ణాటకలో ముస్లిం మైనారిటీలు ఏకమైనందుకే బీజేపీ ఓడిపోయినప్పుడు, తెలంగాణలో 80శాతం హిందూ ఓట్లను ఏకం చేయాల్సిన అవసరం ఉంది.

మక్తల్ నుండి సవాల్ చేస్తున్నా. ఓవైసీ.. నీకు దమ్ముంటే మక్తల్ లో పోటీ చేయి. ఎవడు అధికారంలో ఉంటే వారికి కొమ్ముకాసే పార్టీ ఎంఐఎం. ఓల్డ్ సిటీలో తప్ప బయటకి వచ్చి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. ఆవాజ్ యోజన కింద పేదలకు ఇళ్లు ఇచ్చిన వ్యక్తి మోదీ. తెలంగాణ రాష్ట్రంలో 2లక్షల 40వేల మందికి ఆవాజ్ యోజన ఆసరాగా నిలిచింది. కోవిడ్ ఫ్రీ వ్యాక్సిన్ తో ప్రజల ప్రాణలను కాపాడిని దేవుడు నరేంద్ర మోదీ.

వచ్చే ఐదు నెలలు జోష్ తో మా వెంట ఉంటే కేసీఆర్ అంతు చూసే బాధ్యత నాది. ఇంతకు ముందు విత్ సోడాతో కేసీఆర్. ఇప్పడంతా వితౌట్ సోడాతో కేసీఆర్. బీజేపీలో లేని వర్గాలు ఉన్నాయంటూ వార్తలు క్రియేట్ చేయడమే కెసిఆర్ పని. కేసీఆర్ గడీలను బద్దలు గొట్టాలే. ఆత్మకూరులో సభ ఆత్మవిశ్వాసానికి ఫ్రతీక. మక్తల్ లో బీజేపీ జోష్ నడుస్తోంది.

నరేంద్ర మోదీ ఫ్రధానిగా ఉండటం మనం చేసుకున్న అదృష్టం. దేశ ప్రధాని.. బాత్ రూమ్ ల గురించి మాట్లాడితే కాంగ్రెస్ నవ్వింది. కానీ, ఈరోజు.. స్వచ్చ భారత్ పేరుతో నవ్విన నోళ్లకు తాళం వేశారు. 10కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి మోదీ. 80కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్న హానుభావుడు నరేంద్ర మోడీ. ప్రపంచాన్ని కోవిడ్ నుండి కాపాడిన మహానుభావుడు మోడీ. ప్రపంచ దేశాలు మోదీకి పాదాభి వందనం చేస్తున్నాయి. 2వేల కోట్ల డోసుల కోవిడ్ టీకాలు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది.

ట్రెండింగ్ వార్తలు