Sonia meet Prashant Kishor : 2024 ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తులు..ప్రశాంత్ కిషోర్ ‘4M’ వ్యూహాలు ఫలిస్తాయా..?

2024 ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలు అవుతున్న కాంగ్రెస్ కు ..ప్రశాంత్ కిషోర్ అండ లభించింది. పీకే అండతో ఆయన రచించే ‘4M’ వ్యూహాలు ఫలిస్తాయా..?

Sonia Gandhi meet Prashant Kishor: రోజు రోజుకు చతికిల పడిపోతున్న కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ చేరికపై పూర్వ వైభోగం వస్తుందా? పీకే కాంగ్రెస్ లో చేరిక తరువాత తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? పీకే వినూత్న వ్యూహాలు కాంగ్రెస్ ను గట్టెక్కిస్తాయా? అనే పలు ప్రశ్నలు కాంగ్రెస్ రాజకీయాలన్నీ ప్రశాంత్ కిషోర్ చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రక్షళనకు పీకే సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ ప్రక్షాళనకు హై కమాండ్ ను ఒప్పించే యత్నాలు చేస్తున్నారు పీకే. అధిష్టానం కూడా ప్రశాంత్ కిషోర్ ఇష్టాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పీకేకు కాంగ్రెస్ ఎంతటి ప్రాధాన్యతనిస్తోందో. ఈక్రమంలో పీకే కాంగ్రెస్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది. దీంట్లో భాగంగానే ప్రశాంత కిషోర్ కొత్త ఫార్ములాను రచించినట్లుగా తెలుస్తోంది.

Also read : Sonia – Prasanth kishore: మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయిన సోనియా – ప్రశాంత్ కిషోర్

2024 ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పీకే ఇప్పటి నుంచి కసరత్తులు మొదలుపెట్టారు.అదే ‘4M’. మెజేస్, మెజెంజర్,మెకానిక్,మిషనరీ. ఇలా 4Mలతో కాంగ్రెస్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి పీకే వ్యూహాలు రచిస్తున్నారు. పీకే 4M ప్రతిపాదనకు సోనియా గాంధీ ఓ కమిటిని కూడా నియమించాలని సోనియా నిర్ణయించారు. దీంట్లో భాగంగీ పీకే బీజేపీ అనుసరిస్తున్న జాతీయ వాదం, హిందుత్వం, సంక్షేమం వ్యూహాలపై చర్చిస్తున్న పీకే కాంగ్రెస్ కు గాంధీయేతర నాయకత్వం కావాలని..బీజేపీకి జేపీ నడ్డా ఎలాగో కాంగ్రెస్ కు కూడా ఓ జేపీ నడ్డా కావాలని అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల్లో ఘోర పరాజనాన్ని చవిచూస్తూ..తడబడుతున్న కాంగ్రెస్ ‘హస్తం’కి ప్రశాంత్ కిషోర్ మద్దతు లభించింది. 3 రోజుల్లో రెండు సార్లు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. గత మూడు రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షులు సోనియాగాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం మూడు రోజుల్లో ఇది రెండోసారి కావడం విశేషం.

కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణానికి ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ సీనియర్ నేతలు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీ జరిగిన 3 రోజుల తర్వాత మళ్లీ సోమవారం ప్రశాంత్ కిషోర్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు పార్టీ సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. గత మూడు రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడితో ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ఇది రెండోసారి కావడం విశేషం.

Also read : Covid-19 Update : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 1247 మాత్రమే..!

సోమవారం 10 జనపథ్‌లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రియాంక గాంధీ, అంబికా సోనీ, పి చిదంబరం, జైరాం రమేష్, కెసి వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు. మరోసారి ప్రశాంత్ కిషోర్ పార్టీ ముందస్తు ప్రణాళికను ముఖ్యనేతలకు వివరించినట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యుహాలను వారికి వెల్లడించినట్లు తెలుస్తోంది.

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది పీకే సారధ్యంలో. తొలి సమావేశంలో ప్రశాంత్ కిషోర్ పూర్తి ప్రణాళికను సమర్పించారు. 270 లోక్‌సభ స్థానాలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్‌ను ఆయన కోరారు. దీంతో పాటు ఇతర స్థానాల్లో కూడా పొత్తు పెట్టుకోవాలని సూచించారు. నివేదిక ప్రకారం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో కాంగ్రెస్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకూడదని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ పార్టీ ఒంటరిగానే ఎన్నికల రంగంలోకి దిగాలి. అదే సమయంలో పొత్తు కోసం తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల ఎంపికను పార్టీ హైకమాండ్‌కు ప్రశాంత్ కిషోర్ సూచించారు.

మూడు రోజుల్లోనే ప్రశాంత్ కిషోర్ రెండు సార్లు భేటీ కావడం, నానాటికీ ఊపందుకుంటున్న ఆయన క్రియాశీలత త్వరితగతిన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే చర్చ సాగుతోంది. ప్రశాంత్ కిషోర్ ని కలుపుకుని ఆయన వ్యూహరచన చేయడమే కాకుండా నాయకుడిగా కూడా వాడుకోవాలని పార్టీ భావిస్తోంది. దీనికి సంబంధించి పార్టీ కూడా వారికి సమాచారం అందించింది.

 

ట్రెండింగ్ వార్తలు