Rainy Season Health : వర్షకాలంలో రోగాలు తెచ్చిపెట్టే కలుషితనీరు, ఆహారం!

వర్షా కాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు చికాకు పెడుతుంటాయి. అలాగే అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం లాంటి గ్యాస్ట్రిక్‌ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. వీటిని నివారించేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మంచిది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రోజు వారి అలవాట్లు, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

Contaminated Water And Food

Rainy Season Health : వర్షాకాలంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్ లో డెంగ్యూ, చికన్‌ గున్యా, మలేరియా, కలరా, టైఫాయిడ్, డయేరియా, వైరల్‌ ఫీవర్‌ వంటి ఎన్నో వ్యాధులు వ్యాపిస్తుంటాయి. వేసవి ఎండల నుండి వర్షకాలం కాస్త ఉపశమనం కలిగించినట్లున్నా ఈ కాలంలో వచ్చే వ్యాధులు అందరిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వర్షకాలంలో తాగేనీటి విషయంలో, తినే ఆహారపదార్ధాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించటం ద్వారా వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చు. వర్షకాలపు వాతావరణానికి చాలా మంది రోడ్ సైడ్ లభించే బజ్జీలు, పకోడిలు, దోశ, ఇడ్లీ వంటి వాటిని తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అవి అపరిశ్రుభ్రమైన వాతావరణంలో ఉన్నా, అందులో వేసుకుని తినే చట్నీల్లో కలిపే నీరు కలుషితమైనా ఉదర సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

వర్షా కాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు, జ్వరం వంటి సాధారణ సమస్యలు చికాకు పెడుతుంటాయి. అలాగే అసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం లాంటి గ్యాస్ట్రిక్‌ సమస్యలు సర్వసాధారణంగా వస్తుంటాయి. వీటిని నివారించేందుకు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం మంచిది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు రోజు వారి అలవాట్లు, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పచ్చి ఆకు కూరలను తినడం మానుకోవాలి. ఎందుకంటే అవి సూక్ష్మక్రిములతో నిండి ఉంటాయి. తినాలని భావిస్తే మితంగా తీసుకోవాలి. పచ్చి కూరగాయలకు బదులుగా ఆవిరి మీద ఉడికించిన కూరగాయలను తినాలి. వేడి ఆహారాన్ని తీసుకోవటం మంచిది. వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహారాలు తినరాదు.

పెరుగు లేదా మజ్జిగ వంటి ప్రోబయోటిక్స్‌ కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. అవి మన జీర్ణవ్యవస్థకు మేలుకలిగించే మంచి బ్యాక్టీరియా పెంచేందుకు దోహదం చేస్తాయి. జంక్, స్పైసీ, జిడ్డుగల ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. సీ ఫుడ్‌ తినడం మానుకోవాలి. చేపలు తినడం వల్ల కలరా, డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో వెచ్చని సూప్‌ తాగడం మంచిది. చికెన్‌ సూప్‌ నుంచి క్యారెట్‌ సూప్, మష్రూమ్‌ సూప్‌ లేదా వెజిటబుల్‌ సూప్‌ మొదలైన సూప్‌లను తీసుకోవచ్చు. చల్లని డ్రింక్‌ల జోలికి వెళ్లొద్దు. స్ట్రీట్‌ ఫుడ్‌ కు దూరంగా ఉండటం మంచిది. అధిక మొత్తంలో ఆహారం తీసుకోవటానికి బదులుగా కొద్ది కొద్ది మొత్తాల్లో పలు మార్లు తీసుకోవటం మేలు. నూనెతో తయారు చేసిన పదార్థాలను మితంగా తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయట దొరికే ఆహారపదార్ధాలను తినేకంటే ఉంట్లో తయారు చేసుకుని తినటం ఆరోగ్యానికి అన్ని విధాలుగా శ్రేయస్కరం. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వర్షకాలంలో వ్యాధులు దరిచేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు