Odisha Train Accident : గతంలోనూ పలుసార్లు పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్.. ఆ సమయంలో ఎంత మంది మరణించారంటే?

గతంలోనూ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పలుసార్లు ప్రమాదంకు గురైంది. ఈ ప్రమాదాల్లో పలుసార్లు ప్రాణ‌నష్టం జరగగా.. కొన్నిసార్లు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.

Coromandel Express : ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది. ఈ రైలు ప్రమాదంలో 288 మంది మరణించారు. మరో 1,175 మందికిపైగా గాయాలయ్యాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన రైలు ప్రమాదాలను పరిశీలిస్తే ఒడిశా రైలు ప్రమాదం పెద్దదని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సహా మరో గూడ్స్‌ రైలు ఉన్నాయి. ఇందులో మొదట కోరమాండల్ రైలు పట్టాలు తప్పగా మిగిలిన రెండు రైళ్లు ఆ రైలును ఢీకొట్టాయి. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుండి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

Odisha Train Accident: రైలు ప్రమాదం నుంచి బయటపడి సొంత ప్రాంతానికి తెలుగు యువకులు.. ఏం చెప్పారంటే..?

గతంలోనూ కోరమాండల్ రైలు పలుసార్లు ప్రమాదంకు గురైంది. 2022 మార్చి 15న హౌరా – చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ నెల్లూరు జిల్లాలోని పదుగుపాడు వద్ద పట్టాలు తప్పింది. ఓవర్ బ్రిడ్జిపై ట్రాక్ సరిగాలేక పోవడంతో పట్టాలు తప్పింది. అదేవిధంగా 2009 ఫిబ్రవరి 13న హౌరా – చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ జాజ్‌పూర్ కియోంజర్ రోడ్డు సమీపంలో పట్టాలు తప్పింది. ఆ రోజుకూడా శుక్రవారం కావడం గమనార్హం. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.

Odisha Train Accident: ప్రమాద బాధితులను పరామర్శించిన మోదీ.. ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు

2011 డిసెంబర్ 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 32 మంది ప్రయాణికులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఆ తరువాత 2012లో లింగరాజ్ రైల్వే స్టేషన్ సమీపంలోని కోరమాండల్ జనరల్ కంపార్ట్ మెంట్‌లో మంటలు చెలరేగాయి. అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. 2013లో చిత్తూరు సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు, స్టేషనరీ గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్ ప్రయాణికుల వివరాలు వెల్లడి.. మొత్తం 178 మంది

2015లో నిడదవోలు జంక్షన్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడంతో రెండు బోగీలు దెబ్బతిన్నాయి. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అదేవిధంగా 2019 సంవత్సరంలో యూపీలోని కాన్పూర్ సమీపంలో మానవరహిత లెవెల్ క్రాసింగ్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రక్కును ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

ట్రెండింగ్ వార్తలు