Covid-19 Update : దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కోవిడ్ కేసులు నమోదు

దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Covid-19 Update : దేశంలో నిన్న కొత్తగా 1,49,394 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అదే సమయంలో 1,072 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

దీంతో ఇప్పటివరకు దేశంలో 4,19,52,712కోవిడ్ కేసులు నమోదు కాగా, వీరిలో5,00,055 మంది కోరనా తదితర కారణాలతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 14,35,569 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటి రేటు 9.27 శాతానికి చేరుకుంది.

నిన్న కరోనా నుంచి 2,46,674 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారిసంఖ్య 4,00,17,088 కి చేరుకుంది. దేశంలో కరోన రికవరీ రేటు 95.39 శాతంగా ఉంది.

భారత్‌లో ఇప్పటి వరకు 73,58,04,280 మందికి కరోన నిర్ధారణ పరీక్షలు చేశారు. గడిచిన 24 గంటల్లో 16,11,666 కరోనా టెస్టులు చేశారు. దేశవ్యాప్తంగా 3,249 లాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.వీటిలో 1409 ప్రభుత్వ లాబ్స్,1840 ప్రైవేట్ లాబ్స్ ఉన్నాయని ఐసీఎంఆర్ తెలిపింది.
Also Read : Building Collapse : పూణేలో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఐదుగురు మృతి
మరోవైపు కోవిడ్ వ్యాప్తి నిరోధానికి దేశంలో గత 385 రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 168,47,16,068 మందికి వ్యాక్సిన్ వేశారు. నిన్న 55,58,760మంది కి టీకాలు వేశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు