Karnataka Elections 2023: మేము ఇతర పార్టీల్లా కాదు.. బీజేపీ ఈ ప్రయోగాలు చేస్తోంది: సీటీ రవి

కర్ణాటకలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలు అన్నీ అభ్యర్థుల జాబితాల విడుదలపై దృష్టి పెట్టాయి.

Karnataka Elections 2023: బీజేపీ (BJP) ప్రయోగాలు చేస్తూనే ఉంటుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి (CT Ravi) అన్నారు. వచ్చే నెల 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Elections 2023) జరగాల్సి ఉన్న వేళ మంగళవారం ఆ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 189 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేయగా వారిలో 52 మంది కొత్త వారే ఉన్నారు. చిక్కమగళూరు నియోజక వర్గం నుంచి సీటీ రవి పోటీ చేయనున్నారు.

దీనిపై సీటీ రవి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ… ఇతర పార్టీలలా కాకుండా తమ పార్టీ ప్రయోగాలు చేస్తోందని చెప్పారు. తనకు పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. 52 మంది కొత్త వారికి పోటీ చేసే అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేకతలను చాటుకుంటున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. కర్ణాటకలో ప్రతి ప్రాంతంలోనూ బీజేపీ బలంగా ఉందని తెలిపారు. ఏప్రిల్ 20లోగా తమ పార్టీ రెండో జాబితాను విడుదల చేస్తుందని చెప్పారు.

కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయని తెలిపారు. మరోవైపు, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుతున్నామని చెప్పుకుంటున్నాయని విమర్శించారు. కాగా, బీజేపీ నుంచి కొత్తగా పోటీ చేస్తున్న 52 మందిలో ఎనిమింది మంది మహిళలు, తొమ్మిది మంది వైద్యులు, అయిదుగురు లాయర్లు, ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ చెప్పారు.

అలాగే, మరో ముగ్గురు పదవీ విరమణ చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఎనిమిది మంది సామాజిక కార్యకర్తలకూ టిక్కెట్లు ఇచ్చినట్లు వివరించారు. తొలి జాబితాలోనే కర్ణాటక మంత్రులు శశికళ జొలాయ్, ఆర్.అశోక్, ప్రభో చౌహాన్, శంకర్ మునియకప్పా, ముని రత్న, సోమశేఖర్, వీసీ పాటిల్, వారిటీ వాసు రాజ్, ముర్గేశ్ నిరాణి, సీసీ పాటిల్, సునీల్ కుమార్, శివరామ్ హెబ్బార్ కు టికెట్లు దక్కాయి.

Karnataka Polls: బీజేపీలో చేరిన మాజీ స్పీకర్ కూతురు.. దురదృష్టకరమన్న తండ్రి తిమ్మప్ప

ట్రెండింగ్ వార్తలు