Rose Flower Cultivation : ఇజ్రాయిల్ టెక్నాలజీతో గులాబిపూల సాగు.. ఏడాది పొడవునా దిగుబడులు

బెంగళూరు ఉద్యాన వర్సిటీ వారు రూపొందించిన అర్కాసవి రకంతో పాటు సెంట్ రకం గులాబిని 16 ఎకరాల్లో సాగుచేపట్టారు. పూర్తిగా ఇజ్రాయిల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. మంచి దిగుబడులను తీస్తున్నారు.

Rose Flower Cultivation : మారుతున్న కాలానికి అనుగణంగా సాగు విధానంలోనూ రైతులు కొత్త ఒరవడి చూపుతున్నారు. ఆరుగాలం కష్టించినా, పెట్టుబడులు రాక సతమతమవుతున్న రోజుల్లో.. రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి శాస్త్రీయ విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు.. గులాబి పూల సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇంతకీ ఈ రైతు సాగుచేసిన రకాలేంటీ..? ఏవిధానంలో సాగుచేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

READ ALSO : Rose Cultivation : గులాబీ సాగులో మెళుకువలు, కొమ్మల కత్తిరింపుతో అధిక దిగుబడి!

పువ్వుల్లో రాణిగా పేరొందిన గులాబీని చూడగానే పులకించని మనసు ఉండదు. రకరకాల రంగుల్లో దర్శనమిస్తూ పరిసరాలనే ఆహ్లాదకరంగా మారుస్తాయి. అటువంటి గులాబి తోటకు చిరునామాగా మారింది ఏలూరు జిల్లా, కామరకోట మండలం, కొత్తగండిగూడెం గ్రామం. ఏడాదిన్నరగా గులాబి సాగుచేస్తూ.. చక్కటి ఆదాయాన్ని గడిస్తున్నారు యువ రైతు వెల్లంకి మణిపృథ్వి.

READ ALSO : Marrigold Cultvation : బంతి సాగుతో అధిక లాభాలు పొందుతున్న రైతు

యువరైతు మణిపృథ్వి చదివింది బిటెక్ . సాఫ్ట్ వేర్ గా పలు కంపెనీల్లో పనిచేశారు. అయితే చిన్నప్పటి నుండి వ్యవసాయంపై మక్కువ ఉండటంతో చేసే ఉద్యోగం అంతగా సంతృప్తి నివ్వలేదు. స్వయంగా వ్యవసాయం చేయాలనుకున్నారు. అంతే ఉద్యోగాన్ని వదిలి సొంతూరికి వచ్చారు. తనకున్న 16 ఎకరాల్లో ఉద్యాన పంటలై అరటి, పామాయిల్ , జామ లాంటి వాటిని సాగుచేశారు.

READ ALSO : Water Apple Farming : వాటర్ యాపిల్ సాగుతో.. వావ్ అనిపించే ఆదాయం

అయితే పెద్దగా లాభాలు రాకపోవడంతో వాటి స్థానంలో పూలసాగును చేపట్టాలనుకున్నారు. మర్కెట్ ను పరిశీలించి.. గులాబి పూలకు ఉన్న డిమాండ్ తెలుసుకొని వాటి సాగు విధానం పట్ల 6 నెలల పాటు శిక్షణ కూడా తీసుకున్నారు. బెంగళూరు ఉద్యాన వర్సిటీ వారు రూపొందించిన అర్కాసవి రకంతో పాటు సెంట్ రకం గులాబిని 16 ఎకరాల్లో సాగుచేపట్టారు. పూర్తిగా ఇజ్రాయిల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ.. మంచి దిగుబడులను తీస్తున్నారు.

READ ALSO : Chamanthi Cultivation : లాభాలు పూయిస్తున్న చామంతి పూల సాగు

రైతు మణిపృథ్వి.. డ్రిప్, మల్చంగ్ విధానంలో సాగుచేయడంతో కలుపు సమస్య, నీటివృధా తగ్గింది. అంతే కాదు పూర్తిగా నానో ఎరువులనే వాడుతుండటంతో పెట్టుబడులు తగ్గి, మొక్కలకు సరైన విధంగా పోషకాలు అందుతున్నాయి. తద్వారా నాణ్యమైన దిగుబడులు పొందుతున్నారు. వచ్చిన దిగుబడులను స్థానికంగానే అమ్ముతూ.. మంచి  లాభాలు పొందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు