Banana Cultivation : అరటిలో ముందస్తు తెగుళ్ళ నివారణ

Banana Cultivation : ఉద్యానవన పంటల్లో ప్రధానమైన పంట అరటి. ఏడాది పొడవునా  నాటుకునే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్యకాలంలో అధికంగా నాటతుంటారు రైతులు.

Banana Cultivation : అరటి సాగు విస్తీర్ణం ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నా.. చాలా మంది రైతులు సరైన యాజమాన్యం పాటించలేకపోతున్నారు. 12 నెలలపాటు కొనసాగే ఈ పంటలో తెగుళ్ల బెడద అధికమవుతోంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఆశించే సిగటోక ఆకుమచ్చ, పనామ తెగుళ్ల కారణంగా అరటి తోటల్లో దిగుబడి తగ్గి నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. రైతులు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే.. తెగుళ్లను నివారించవచ్చని తెలియజేస్తున్నారు కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. స్నేహలత.

Read Also : Banana Cultivation : వేసవి అరటి తోటల్లో మేలైన యాజమాన్యం

ఉద్యానవన పంటల్లో ప్రధానమైన పంట అరటి. ఏడాది పొడవునా  నాటుకునే అవకాశం ఉంది. అయితే చాలా వరకు ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్యకాలంలో అధికంగా నాటతుంటారు రైతులు. మొక్కలు పెరిగే కొద్ది తోటలో మొత్తం నీడ వాతావరణం ఏర్పడుతుంది. దీంతో తోటలో మైక్రో క్లైమేట్ ఏర్పడుతుంది. ఇది భూమిలో శిలీంధ్రాల అభివృద్ధికి తోడ్పడుతుంది. మొక్కలు ఆరోగ్య వంతంగా ఉన్నప్పుడు వీటి దాడి ఉండనప్పటికీ, ప్రతికూల వాతావరణం, నీటి ఎద్దడి పరిస్థితులతో మొక్కలు వత్తిడికి గురైనప్పుడు అరటి మొక్కలు సులభంగా తెగుళ్లకు లొంగిపోతాయి.

ముఖ్యంగా వర్షాకాలంలో అరటి తోటలకు తెగుళ్ల ముప్పు పొంచి ఉంది. అధికంగా సిగటోకా, పనామ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ఈ తెగుళ్లు 30 శాతానికి పెరిగితే దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడులను తీసుకోవచ్చని రైతులకు తెలియజేస్తున్నారు పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. స్నేహలత.

అరటి తోటలను ఆశించే  తెగుళ్లలో అతి ప్రమాధకరమైనది  పనామా తెగులు.  ఈ తెగులు  విత్తన పిలకల ద్వారా , మట్టి ద్వారా వ్యాపిస్తుంది. తెగులు ఆశిస్తుంది. ఈ తెగులును రసాయనాల ద్వారా నివారించటం సాధ్యం కాదు. ఎన్ని మందులు పిచికారి చేసినా నియంత్రణలోకి రాదు. కాబట్టి ఈ తెగులును తట్టుకునే రకాలను ఎన్నుకొని  సాగుచేయాలి. అంతే కాదు శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే పూర్తి స్తాయిలో నియంత్రించవచ్చు.

Read Also : Beans Cultivation : చిక్కుడులో వేరుకుళ్లు తెగులు – నివారణకు శాస్త్రవేత్తల సూచనలు 

ట్రెండింగ్ వార్తలు