Vari Narumadi : తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా వరినారుమళ్ళ పెంపకం

Vari Narumadi : తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు.

Vari Narumadi : తెలుగు రాష్ట్రాల్లో వరినారుమళ్లు  పోసే పనులు  కొనసాగుతున్నాయి. కొంత మంది రైతులు  నేరుగా వరి వెదజల్లే విధానాన్ని పాటిస్తుండగా.. చాలామంది రైతులు మాత్రం నారుమళ్ల ను పెంచి, నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరి కొంత మంది ఇప్పుడిప్పుడే పోస్తున్నారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అందిరావాలంటే , నారుమడిలో పాటించాల్సిన  మేలైన యాజమాన్యం  ఏంటో ఇప్పుడు చూద్దాం.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు  

తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినారుమళ్లు పోసుకున్నారు. మంచి వర్షాల కోసం మిగితా  రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే నారు ఆరోగ్యంగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో నాటుకు అందిరావాలంటే..  మేలైన యాజమాన్యం తప్పనిసరి  అని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, విజయ్.

ఎత్తుమళ్లలో విత్తనం పోసిన తర్వాత నీరు నిల్వ వుండకుండా  చూసుకోవాలి . నీరు నిల్వ వుంటే విత్తనం మురిగిపోతుంది . మడుల మధ్య కాలువలు ఏర్పాటుచేసుకుంటే  నీరు నిల్వ వుండదు. ఏ కారణం చేతైనా పోషకాలను  సకాలంలో అందించని రైతాంగం, పిచికారీ రూపంలో అందిస్తే మంచిది.

Read Also : Agri Tips : ఖరీఫ్‌కు అనువైన.. స్వల్పకాలిక సన్న, దొడ్డుగింజ రకాలు

ట్రెండింగ్ వార్తలు